CUET UG 2023 registration dates: సీయూఈటీ యూజీ 2023 దరఖాస్తు తేదీల కీలక ప్రకటన
CUET UG 2023 registration dates: సీయూఈటీ యూజీ 2023 రిజిస్ట్రేషన్ తేదీలపై యూజీసీ ఛైర్మన్ స్పష్టత ఇచ్చారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA CUET UG 2023 రిజిస్ట్రేషన్ తేదీలను రెండు రోజుల్లో ప్రకటిస్తుందని యూజీసీ ఛైర్మన్ చెప్పారు. కామన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు, దరఖాస్తు ప్రక్రియ సమాచారం అభ్యర్థులకు CUET అధికారిక సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రక్రియ వివరాలను యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ‘సెంట్రల్ యూనివర్శిటీలు, పలు ఇతర యూనివర్శిటీలలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోసం కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ (యుజి) - 2023) రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రక్రియ వివరాలు రెండు రోజుల్లో ప్రకటిస్తాం..’ అని ట్వీట్ చేశారు.
డిసెంబర్‌లో యూజీసీ విడుదల చేసిన మునుపటి నోటీసులో CUET UG 2023 రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 2023 మొదటి వారంలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అది వాయిదా పడినట్లుగా అవగతమవుతోంది.
అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం CUET UG పరీక్ష మే 21 నుండి 31, 2023 మధ్య నిర్వహించనున్నారు. 13 భాషలలో రాత పరీక్ష నిర్వహిస్తారు. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని 1000 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.