AIMPLB reacts on UCC: ‘‘మతపరమైన మైనారిటీలను మినహాయించాలి’’: యూసీసీపై ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సూచన-the all india muslim personal law board writes to the law commission on the uniform civil code ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aimplb Reacts On Ucc: ‘‘మతపరమైన మైనారిటీలను మినహాయించాలి’’: యూసీసీపై ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సూచన

AIMPLB reacts on UCC: ‘‘మతపరమైన మైనారిటీలను మినహాయించాలి’’: యూసీసీపై ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సూచన

HT Telugu Desk HT Telugu
Jul 06, 2023 11:11 AM IST

AIMPLB reacts on UCC: ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code UCC) పై తమ అభ్యంతరాలను లా కమిషన్ కు పంపించామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

AIMPLB reacts on UCC: ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code UCC) పై తమ అభ్యంతరాలను లా కమిషన్ కు పంపించామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) వెల్లడించింది. గిరిజనులనే కాకుండా, అన్ని మతపరమైన మైనారిటీలను ఈ ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code UCC) పరిధి నుంచి తప్పించాలని కోరామని తెలిపింది.

AIMPLB reacts on UCC: సమగ్రంగా లేదు..

యూసీసీపై సూచనలు, సలహాలు కోరుతూ లా కమిషన్ ఇచ్చిన నోటీసు సమగ్రంగా లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు విమర్శించింది. ఈ వివాదాస్పద బిల్లుపై తమ నిర్ణయాలను విశ్లేషణాత్మకంగా, సమగ్రంగా తెలిపే అవకాశం సామాన్య ప్రజలకు ఇవ్వడం లేదని పేర్కొంది. యూసీసీని ఆమోదించడానికి లేదా వ్యతిరేకించడానికి సంబంధించి ‘యెస్’ లేదా ‘నో’ అనే సమాధానం సమగ్రంగా ఉండదని తెలిపింది. అయితే, ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code UCC) పై లా కమిషన్ కు తమ అభిప్రాయం తెలపాలని నిర్ణయించుకుని, ముసాయిదాను రూపొందించామని, ఆ ముసాయిదాకు ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యనిర్వాహక సమావేశంలో ఆమోదం లభించినదని వెల్లడించింది.

మతపరమైన మైనారిటీలకు మినహాయింపు

ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code UCC)పై తమ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తెలియజేయడానికి జులై 14 ఆఖరు తేదీ అని లా కమిషన్ స్పష్టం చేసింది. వ్యక్తులు, సంస్థలు తమ సూచనలను పంపించవచ్చు. గిరిజనులకు మాత్రమే కాకుండా, మతపరమైన మైనారిటీలు (religious minority) అందరికీ ఈ ఉమ్మడి పౌర స్మృతి నుంచి మినహాయింపు ఇవ్వాలన్నది తమ డిమాండ్ అని, అదే విషయాన్ని లా కమిషన్ కు తెలియజేశామని ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) అధికార ప్రతినిధి ఓసమ్ రసూల్ ఇలియాస్ వెల్లడించారు.

ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకం

ఉమ్మడి పౌర స్మృతికి తాము వ్యతిరేకమని ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) తేల్చి చెప్పింది. భిన్న మతాలు, భిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉన్న భారత్ లో అందరికీ ఒకే చట్టం పేరుతో ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తీసుకురావడమనేది ప్రజాస్వామ్య హక్కులకు, ప్రజాస్వామ్య విలువలకు విఘాతమని లా కమిషన్ కు పంపిన నివేదికలో ముస్లిం లా బోర్డు పేర్కొంది. పర్సనల్ లా లను, మెజారిటీ వాద నైతిక నియంతృత్వం అణచి వేయాలనుకోవడాన్ని వ్యతిరేకిస్తామని తెలిపింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) సభ్యులు ఈ ఉమ్మడి పౌర స్మృతిని ఏకగ్రీవంగా వ్యతిరేకించారని వెల్లడించింది. భారత్ లో ఉమ్మడి పౌర స్మృతి అవసరం లేదని వివరించింది. ఐదేళ్ల క్రితం 21వ లా కమిషన్ కూడా యూసీసీ అవసరం లేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది.

Whats_app_banner