Tejashwi Yadav on new jet purchase: ‘‘మేం హెలీకాప్టర్ కొంటే మీకేం బాధ’’
Tejashwi Yadav on new jet purchase: సొంతంగా జెట్ ప్లేన్ ను, హెలీకాప్టర్ ను కొనుగోలు చేయాలన్న బిహార్ ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ దుమారం చెలరేగింది.
Tejashwi Yadav on new jet purchase: రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక జెట్ విమానాన్ని, ఒక హెలీకాప్టర్ ను కొనుగోలు చేయాలని బిహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై విపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆ నిర్ణయంపై పునరాలోచించాలని నితీశ్ ప్రభుత్వాన్ని కోరింది.
Tejashwi Yadav on new jet purchase: సొంతంగా లేనందువల్లనే..
బీజేపీ విమర్శలపై ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ స్పందించారు. ప్రభుత్వం తరఫున జెట్ విమానాన్ని, చాపర్ ను కొనాలని తీసుకున్న నిర్ణయంపై బీజేపీకి ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. చాలా రాష్ట్రాలకు సొంతంగా విమానాలు, చాపర్లు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీవీఐపీలు వినియోగించడానికి చాపర్లను లీజు కు తీసుకునేవారని, అందుకు బదులుగా, ఇప్పుడు సొంతంగా వాటిని కొనాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తేజస్వీ యాదవ్ వివరించారు.
Tejashwi Yadav on new jet purchase: సీఎం అయ్యాక తిరగాలని..
త్వరలో బిహార్ ముఖ్యమంత్రి ని అవుతానని తేజస్వీ యాదవ్ కలలు కంటున్నారని, అందువల్ల సీఎం అయిన తరువాత వాడడం కోసం ఇప్పుడు బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేత జెట్ విమానాన్ని, హెలీకాప్టర్ ను కొనిపిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు. 2024 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటించడానికి కూడా వాటిని వాడాలన్నది వారి ప్రణాళిక అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, విమానం, చాపర్ కొనుగోలు నిర్ణయంపై పునరాలోచించాలని ఆయన కోరారు.