Supreme Court allows Jallikattu: ‘జల్లికట్టు’ కు సుప్రీంకోర్టు అనుమతి-supreme court allows jallikattu upholds amendment passed by tamil nadu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court Allows Jallikattu: ‘జల్లికట్టు’ కు సుప్రీంకోర్టు అనుమతి

Supreme Court allows Jallikattu: ‘జల్లికట్టు’ కు సుప్రీంకోర్టు అనుమతి

HT Telugu Desk HT Telugu

Supreme Court allows Jallikattu: తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టు’ నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. తమిళనాడులో దాదాపు వందేళ్లుగా కొనసాగుతున్న ఈ క్రీడ జంతు హింస చట్టం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.

ప్రతీకాత్మక చిత్రం (Wikimedia Commons/Djoemanoj)

Supreme Court allows Jallikattu: తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జల్లి కట్టు (Jallikattu) నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని గురువారం సుప్రీంకోర్టు సమర్ధించింది. అలాగే ఇదే తరహా క్రీడలైన ‘కంబాల (Kambala)’పై కర్నాటక ప్రభుత్వం చేసిన చట్టాన్ని, ‘ఎడ్ల బండ్ల పోటీ(bull-cart race)’ పై మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలను కూడా సమర్దించింది. అయితే, ఆ పోటీల్లో పాల్గొనే జంతువుల భద్రతకు సంబంధించి ఆయా చట్టాల్లో చేసిన సవరణలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. జల్లికట్టు (Jallikattu) ను తమిళ సంప్రదాయంలో భాగం కాదంటూ 2014 లో ఇచ్చిన తీర్పు సరి కాదని వివరించింది.

Supreme Court allows Jallikattu: జల్లికట్టు తమిళనాడు సంప్రదాయ క్రీడ

జల్లికట్టు (Jallikattu) తమిళ సంప్రదాయ క్రీడే అంటూ రాష్ట్ర శాసన సభ చేసిన నిర్ధారణను పరిగణనలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. శాసన వ్యవస్థ అభిప్రాయాలను వ్యతిరేకించాలనుకోవడం లేదని, అది న్యాయవ్యవస్థ పరిధిలోని అంశం కాదని వ్యాఖ్యానించింది. జల్లికట్టు (Jallikattu) లో పాల్గొనే జంతువులు, మనుషులు తీవ్రంగా గాయపడుతున్నారని, అది జంతు హింస చట్టం పరిధిలో నేరమని పేర్కొంటూ 2014లో సుప్రీంకోర్టు ముందుకు పలు పిటిషన్లు వచ్చాయి. దాంతో, సుప్రీంకోర్టు ఆ తమిళ సంప్రదాయ క్రీడను 2014లో నిషేధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై తమిళనాడుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. దాంతో, జంతువులపై హింసను నివారించే చట్టం ‘ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్’ చట్టాన్ని సవరిస్తూ జల్లికట్టు (Jallikattu) కు అనుకూలంగా తమిళనాడు ప్రభుత్వం సవరణ చట్టం తీసుకువచ్చింది. ఆ సవరణ చట్టం పై దాఖలైన పిటిషన్ల విచారణ అనంతరం గురువారం సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.