Stock market | లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. 17,300 మార్కును అందుకున్న నిఫ్టీ
దేశీయ సూచీలు శుక్రవారం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 17,300 మార్కును అందుకుంది.
అంతర్జాతీయ సానుకూల పవనాల మధ్య దేశీయ సూచీలు శుక్రవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 234పాయింట్ల లాభంతో 57,756 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 67 పాయింట్లు వృద్ధి చెంది 17,312 వద్ద కొనసాగుతోంది.
గత ట్రేడింగ్ సెషన్‌ను 57,521 వద్ద ముగించిన సెన్సెక్స్.. శుక్రవారం 57,817 వద్ద ఓపెన్ అయ్యింది. ఇక గురువారం 17,245 వద్ద ముగిసిన నిఫ్టీ.. ఏకంగా 17,329 వద్ద సెషన్‌ను ప్రారంభించింది.
లాభాలు.. నష్టాలు..
సన్‌ఫార్మా షేర్లు 3శాతం మేర పెరిగాయి. ఇండస్ఇండ్, డా.రెడ్డీస్, ఎం ఆండ్ ఎం, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ, ఎల్టీ, కొటాక్బ్యాంక్, బజాజ్‌ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్టెల్ షేర్లు 1శాతం మేర వృద్ధిచెందాయి.
యాక్సిస్ బ్యాంక్ షేర్లు 3.8శాతం పడ్డాయి. పవర్‌గ్రిడ్, నెస్లే, హెచ్‌యూఎల్, మారుతీ, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఎఫ్ఐఐలు కొనగోళ్లవైపు..!
కొన్ని రోజుల వరుస నష్టాల అనంతరం దేశీయ సూచీలు గురువారం లాభాలతో ముగిశాయి. భారీ అమ్మకాలపై దృష్టి పెట్టి, స్టాక్ మార్కెట్ల పతనానికి ఒక కారణంగా మారిన ఎఫ్ఐఐలు సైతం.. గురువారం కొనుగోళ్లవైపు మొగ్గుచూపారు.
సంబంధిత కథనం
టాపిక్