Stalin is my brother says Mamata: ‘స్టాలిన్ నా తమ్ముడు.. కలవకుండా ఎలా వెళ్తా?’-stalin my brother had to meet him mamata outside tamil nadu cm s residence ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stalin Is My Brother Says Mamata: ‘స్టాలిన్ నా తమ్ముడు.. కలవకుండా ఎలా వెళ్తా?’

Stalin is my brother says Mamata: ‘స్టాలిన్ నా తమ్ముడు.. కలవకుండా ఎలా వెళ్తా?’

HT Telugu Desk HT Telugu
Nov 03, 2022 07:24 PM IST

Stalin is my brother says Mamata: తమిళనాడు సీఎం స్టాలిన్ తనకు సోదరుడి వంటి వాడని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ అన్నారు. బుధవారం ఆమె చెన్నైలో స్టాలిన్ నివాసానికి వెళ్లి, కాసేపున్నారు.

మీడియాతో మమత బెనర్జీ, ఎంకే స్టాలిన్
మీడియాతో మమత బెనర్జీ, ఎంకే స్టాలిన్ (ANI)

Stalin is my brother says Mamata: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ బుధవారం చెన్నై వెళ్లారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గణేశన్ కుటుంబ వేడుకలో పాల్గొనడం కోసం ఆమె చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసి కాసేపు ముచ్చటించారు.

Stalin is my brother says Mamata:నా తమ్ముడి వంటి వాడు..

స్టాలిన్ నివాసానికి వెళ్లిన సమయంలో అక్కడి మీడియాతో మమత కాసేపు మాట్లాడారు. స్టాలిన్ తనకు సోదరుడితో సమానమని, తమ మధ్య తోబుట్టువుల వంటి అనుబంధం ఉందని తెలిపారు. కుటుంబంతో కలిసి కోల్ కతా రావాల్సిందిగా స్టాలిన్ ను ఆహ్వానించానని వెల్లడించారు. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్న తరుణంలో.. రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల నేతలు సమావేశమవడం రాజకీయ వర్గాల్లో సంచలనానికి కారణమైంది.

Stalin is my brother says Mamata: రాజకీయాలు మాట్లాడలేదు

స్టాలిన్ నివాసంలో మమత అర గంట పాటు గడిపారు. అయితే, తమ మధ్య రాజకీయాల ప్రస్తావనేమీ రాలేదని, రాజకీయాలకు సంబంధం లేని అంశాలపై మాట్లాడుకున్నామని మమత తెలిపారు. ఇద్దరు రాజకీయ నాయకులు రాజకీయాలే మాట్లాడుకోవాలని ఏం లేదని, వేరే విషయాల గురించి చర్చించుకున్నామని తెలిపారు. ‘ఫ్యామిలీ ఫంక్షన్ కోసం చెన్నై వచ్చాను. ఇక్కడికి వచ్చి నా సోదరుడిని కలవకుండా ఎలా వెళ్తాను?’ అని మమత వ్యాఖ్యానించారు. అంతకుముందు, చెన్నై బయల్దేరే ముందు, కోల్ కతా ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ.. స్టాలిన్ తనకు రాజకీయ స్నేహితుడని మమత వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతీయ పార్టీలను తాను విశ్వసిస్తానని, 2024 ఎన్నికల్లో అవి కీలక పాత్ర పోషించబోతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

IPL_Entry_Point

టాపిక్