SSC CGL 2023 Notification: ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చేసింది: 7,500కుపైగా ఉద్యోగాలు.. అప్లికేషన్స్ ప్రారంభం-ssc cgl 2023 notification out application process begins at ssc nic in check full details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ssc Cgl 2023 Notification: ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చేసింది: 7,500కుపైగా ఉద్యోగాలు.. అప్లికేషన్స్ ప్రారంభం

SSC CGL 2023 Notification: ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చేసింది: 7,500కుపైగా ఉద్యోగాలు.. అప్లికేషన్స్ ప్రారంభం

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 04, 2023 09:58 AM IST

SSC CGL 2023 Notification: ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ఆరంభమైంది. వివరాలివే..

SSC CGL 2023 Notification: ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ అప్లికేషన్ ప్రక్రియ మొదల: 7,500కుపైగా ఉద్యోగాలు.. అప్లికేషన్స్ ప్రారంభం
SSC CGL 2023 Notification: ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ అప్లికేషన్ ప్రక్రియ మొదల: 7,500కుపైగా ఉద్యోగాలు.. అప్లికేషన్స్ ప్రారంభం

SSC CGL 2023 Notification: కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) 2023 పరీక్షకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే అప్లికేషన్ (SSC CGL Application) ప్రక్రియ మొదలైంది. ఈ సీజీఎల్ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (Staff Selection Commission - SSC) భర్తీ చేయనుంది. సుమారు 7,500 వరకు ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ సీజీఎల్ 2023 అప్లికేషన్స్ ప్రాసెస్ ssc.nic.in వెబ్‍సైట్‍లో మొదలైంది. దరఖాస్తు సమర్పించేందుకు మే 3వ తేదీ ఆఖరు గడువుగా ఉంది. పూర్తి వివరాలు ఇవే.

SSC CGL 2023 Notification: ముఖ్యమైన తేదీలు ఇవే

  • అప్లికేషన్లు సమర్పించేందుకు ఆఖరు తేదీ: 03-05-2023 (మే 3)
  • ఆన్‍లైన్ ఫీజు పేమెంట్‍కు ఆఖరు తేదీ : 04-05-2023
  • ఆఫ్‍లైన్ చలాన్ జనరేషన్ లాస్ట్ డేట్: 04-05-2023
  • అప్లికేషన్‍లో వివరాల కరెక్షన్: 07-05-2023 నుంచి 08-05-2023 వరకు
  • టైర్-1 కంప్యూటర్ బేస్డ్ పరీక్ష : జూలై 2023

SSC CGL 2023 Notification: విద్యార్హత: ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ పోస్టులను దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్ (బ్యాచిలర్ డిగ్రీ) విద్యార్హత ఉండాలి. కొన్ని పోస్టులకు నిర్ధిష్టమైన డిగ్రీ ఉండాలి. నోటిఫికేషన్‍లో పూర్తి వివరాలు ఉన్నాయి. Ssc.nic.inలో నోటిఫికేషన్ అందుబాటులో ఉంది. హోం పేజీలోని లేటెస్ట్ న్యూస్ సెక్షన్లో ఈ నోటిఫికేషన్‍ను డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.

SSC CGL 2023 Notification: వయో పరిమితి

18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి కొన్ని పోస్టులకు గరిష్ట వయోపరిమితి 27 ఏళ్లు, 30ఏళ్లు కూడా ఉంది. దీని కోసం నోటిఫికేషన్‍ను జాగ్రత్తగా పరిశీలించాలి. ఎస్‍సీ, ఎస్‍టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో పరిమితి సడలింపు ఉంది. మిగిలిన కేటగిరీలకు నిబంధనల మేర మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) టైర్-1 పరీక్ష ఉంటుంది. టైర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆ తర్వాత టైర్-2 పరీక్ష జరుగుతుంది. కొన్ని పోస్టులకు టైర్-1 పరీక్ష మాత్రమే ఉంటుంది. పరీక్షలో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది ఎస్‍ఎస్‍సీ.

దరఖాస్తు ఫీజు: ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ 2023 దరఖాస్తు ఫీజు రూ.100గా ఉంది. మహిళలు, ఎస్‍సీ, ఎస్‍టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‍మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 7,500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‍లో ఎస్‍ఎస్‍సీ పేర్కొంది. ఇందులో వివిధ పోస్టులు ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఈ సంఖ్యలో మార్పు ఉంటుందని తెలిపింది.

SSC CGL 2023 Notification: అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

  • ముందుగా ఎస్‍ఎస్‍సీ అధికారిక వెబ్‍సైట్ ssc.nic.in లోకి వెళ్లండి.
  • హోం పేజీలో లాగిన్ అవండి. ఒకవేళ ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోండి. అడిగిన వివరాలను సమర్పించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మీ మొబైల్, ఈ-మెయిల్‍కు లాగిన్ వివరాలను వస్తాయి.
  • వాటిని ఉపయోగించి లాగిన్ అవండి.
  • ఆ తర్వాత ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ 2023 అప్లికేషన్ లింక్ కనిపిస్తుంది. లేకపోతే హోంపేజీలో అప్లై ఆప్షన్‍పై క్లిక్ చేసి, సీజీఎల్ సెక్షన్‍కి వెళ్లినా లింక్ ఉంటుంది.
  • ఇక ఆ తర్వాత అప్లికేషన్‍లో అన్ని వివరాలను ఎంటర్ చేయండి. మీ ఫొటో, సంతకం స్కాన్డ్ ఫొటోను అప్‍లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • ఇక అప్లికేషన్ పూర్తయ్యాక ఆన్‍లైన్‍లోనే ఫీజు చెల్లించవచ్చు.
  • ఫీజు చెల్లించడం పూర్తయ్యాక సబ్మిట్ బటన్‍పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్‍ను డౌన్‍లోడ్ చేసుకొని, ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ 2023 అప్లికేషన్‍ను డైరెక్ట్ లింక్ ఇదే

IPL_Entry_Point