Southwest Monsoon in Kerala : ప్చ్.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం!
Southwest Monsoon in Kerala 2023 : నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది. కేరళలోకి రుతుపవనాలు ఇంకా ప్రవేశించలేదని సమాచారం.

Southwest Monsoon in Kerala 2023 : ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్! నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి.. రుతుపవనాలు.. ఆదివారమే కేరళను తాకాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియ ఇప్పుడు మరింత ఆలస్యమైందని స్థానిక మీడియా వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు సాధారణంగా ప్రతియేటా జూన్ 1కి అటు, ఇటుగా కేరళలోకి ప్రవేశిస్తాయి. ఈసారి జూన్ 4 నాటికి అవి కేరళను తాకుతాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఇలా జరగడం లేదని సమాచారం.
ఎందుకు ఆలస్యం..?
నైరుతి రుతుపవనాలు జూన్ 3 నాటికి లక్షద్వీప్‌కు పశ్చిమ భాగాన్ని తాకాయి. అక్కడి నుంచి కేరళలోవైపు కదిలేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడలేదు. అందుకే అవి ఆదివారం నాటికి కేరళలోకి ప్రవేశించలేకపోతున్నాయని వాతావరణశాఖ తెలిపినట్టు స్థానిక మీడియా సంస్థ పేర్కొంది.
Southwest Monsoon latest news : రుతుపవనాల రాకను లెక్కగట్టేందుకు కొన్ని కండీషన్లు ఉంటాయి. పశ్చిమవైపు ఉన్న గాలుల బలం, లక్షద్వీప్ నుంచి కేరళ వరకు మేఘాల విస్తరణ వంటిని లెక్కిస్తారు. వీటితో పాటు కేరళలోని 14 వాతావరణ కేంద్రాల్లో వరుసగా రెండు రోజుల పాటు 60శాతం (కనీసం 2ఎంఎం వర్షపాతం) వర్షాలు పడాలన్నది మరో కండీషన్. ఈ ఏడాది ఇప్పటివరకు ఇవేవీ జరగలేదు.
మరోవైపు సోమవారం.. అరేబియా సముద్రానికి నైరుతి దిశలో సుడిగాలులు ఏర్పడే అవకాశం ఉంది. అది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. వాతావరణశాఖ రానున్న రెండు రోజుల పాటు ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షిస్తుంది.
ఢిల్లీలో వర్షాలు..!
మరోవైపు ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ (భారత వాతావరణశాఖ) వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్‌లలోనూ నేడు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఇక హైదరాబాద్‌లో వాతావరణ చల్లబడింది. శనివారం సాయంత్రం వరకు భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోయారు. కాగా.. అర్ధరాత్రి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఆదివారం ఎండ తీవ్రత తక్కువగా ఉంది.
సంబంధిత కథనం