SC Railway recruitment: దక్షిణ మధ్య రైల్వేలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
SC Railway recruitment: జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్ట్ ల భర్తీకి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు scr.indianrailways.gov.in. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
SC Railway recruitment: జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్ట్ ల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్ సైట్ scr.indianrailways.gov.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు.
జూన్ 30 లాస్ట్ డేట్
దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ జూన్ 30. ఈ లోపు అభ్యర్థులు ఆన్ లైన్ లో scr.indianrailways.gov.in. ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. విద్యార్హతలు, వయో పరిమితి, రిజర్వేషన్, తదితర వివరాల కోసం అభ్యర్థులు scr.indianrailways.gov.in. లోని నోటిఫికేషన్ ను చెక్ చేసుకోవాలి.
వేకెన్సీల వివరాలు..
సివిల్ ఇంజినీరింగ్ - 19 పోస్ట్ లు
ఎలక్ట్రికల్ (డ్రాయింగ్) - 10 పోస్ట్ లు
ఎస్ అండ్ టీ (డ్రాయింగ్) - 6 పోస్ట్ లు
ఈ పోస్ట్ ల సెలక్షన్ కు క్వాలిఫికేషన్ కు 55 మార్కులు, ఎక్స్ పీరియన్స్ కు 30 మార్కులు, ఇంటర్వ్యూకి 15 మార్కులు ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు
ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థులు రూ. 500 లను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళలు, ఈ డబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి.