Shiv Sena MP recites ‘Hanuman Chalisa’: ‘అవిశ్వాసం’పై చర్చలో హనుమాన్ చాలీసా
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. చర్చలో పాల్గొన్న శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం ఎంపీ శ్రీకాంత్ షిండ్.. తనకు హనుమాన్ చాలీసా పూర్తిగా కంఠస్థం వచ్చునని చెబుతూ, హనుమాన్ చాలీసాను చదవడం ప్రారంభించారు.
అవిశ్వాస తీర్మానం (No Confidence Motion) పై చర్చ సందర్భంగా లోక్ సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. చర్చలో పాల్గొన్న శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం ఎంపీ శ్రీకాంత్ షిండ్.. తనకు హనుమాన్ చాలీసా పూర్తిగా కంఠస్థం వచ్చునని చెబుతూ, హనుమాన్ చాలీసాను చదవడం ప్రారంభించారు.
ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు
మణిపూర్ హింసపై లోక్ సభలో విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ జరిగింది. ఈ చర్చలో శివసేన తిరుగుబాటు వర్గం తరఫున ఆ పార్టీ ఎంపీ శ్రీకాంత్ షిండే మాట్లాడారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన తిరుగుబాటు వర్గం నేత ఏక్ నాథ్ షిండే కుమారుడు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో ముంబైలో, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ఇంటిముందు ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణా హనుమాన్ చాలీసాను చదివిన విషయాన్ని గుర్తు చేస్తూ.. తనకు హనుమాన్ చాలీసా పూర్తిగా కంఠస్థం వచ్చునని చెబుతూ, హనుమాన్ చాలీసాను చదవడం ప్రారంభించారు. ఆయన అలా ఆపకుండా హనుమాన్ చాలీసాను చదవడం కొనసాగిస్తుండడంతో, స్పీకర్ కలగజేసుకున్నారు. హనుమాన్ చాలీసా చదవడం ఆపేసి చర్చలో పాల్గొనాలని సూచించారు. దాంతో, శ్రీకాంత్ షిండే హనుమాన్ చాలీసాను చదవడం నిలిపివేశారు.