SBI PO Final Result 2023: ఎస్బీఐ పీఓ 2023 ఫైనల్ రిజల్ట్స్ విడుదల; ఇలా చెక్ చేసుకోండి..
SBI PO Final Result 2023: ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పరీక్షల తది ఫలితాలు విడుదల అయ్యాయి. ఎస్బీఐ పీఓలు గా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in లో చెక్ చేసుకోవచ్చు.
SBI PO Final Result 2023: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పీఓ ఫైనల్ రిజల్ట్ 2023 ను మార్చి 19, 2024 న ప్రకటించింది. గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ రౌండ్ లకు హాజరైన అభ్యర్థులు ప్రొబేషనరీ ఆఫీసర్ తుది ఫలితాలను ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in లో చెక్ చేసుకోవచ్చు. ఎస్బీఐ పీఓ 2023 మెయిన్స్ పరీక్ష (SBI PO 2023 mains)లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 2024 జనవరిలో గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ అనంతరం ప్రొబేషనరీ ఆఫీసర్లుగా తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల రోల్ నంబర్లను బ్యాంక్ విడుదల చేసింది.
గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ
ఎస్బీఐ పీఓ 2023 మెయిన్స్ (SBI PO 2023) పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి జనవరి 16 నుంచి సైకోమెట్రిక్ పరీక్ష, జనవరి 21 నుంచి గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూ రౌండ్ కు హాజరు కావడానికి అర్హత సాధించారు. ఎస్బీఐ పీఓ 2023 మెయిన్ పరీక్షను 2023 డిసెంబర్ 5న నిర్వహించి, 2024 జనవరి 11న ఫలితాలను ప్రకటించారు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఎస్బీఐ పీఓ 2023 కి సంబంధించి 2023 సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు దరఖాస్తులను స్వీకరించారు.
ఎస్బీఐ పీఓ 2023 ఫైనల్ రిజల్ట్స్ ను ఇలా చెక్ చేసుకోండి
ఎస్బీఐ పీఓ 2023 ఫైనల్ రిజల్ట్ ను చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
- ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ను సందర్శించండి.
- కెరీర్స్ లింక్ పై క్లిక్ చేసి, ఆపై కరెంట్ ఓపెనింగ్ లింక్ పై క్లిక్ చేయండి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఎస్బీఐ పీఓ 2023 ఫైనల్ రిజల్ట్ లింక్ ఉంటుంది.
- ఆ లింక్ పై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
- ఆ పీడీఎఫ్ లో రిజల్ట్ చెక్ చేసుకుని పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- భవిష్యత్ అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.