NEET UG : నీట్​ క్రాక్​ చేసిన ‘సమోసా’వాలా- ఇతని కథ ఎంతో స్ఫూర్తిదాయకం!-samosa seller 18 cracks neet ug says selling samosas wont define my future ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Ug : నీట్​ క్రాక్​ చేసిన ‘సమోసా’వాలా- ఇతని కథ ఎంతో స్ఫూర్తిదాయకం!

NEET UG : నీట్​ క్రాక్​ చేసిన ‘సమోసా’వాలా- ఇతని కథ ఎంతో స్ఫూర్తిదాయకం!

Sharath Chitturi HT Telugu
Aug 30, 2024 10:18 AM IST

కొన్ని కథలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కొందరి కథలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అలాంటి వారిలో సన్నీ కుమార్​ ఒకరు! 18ఏళ్ల వయస్సులో సమోసాలు విక్రయిస్తూ, నీట్​ యూజీని తొలి అటెంప్ట్​లోనే క్రాక్​ చేశాడు సన్నీ.

నీట్​ క్రాక్​ చేసిన ‘సమోసా’వాలా
నీట్​ క్రాక్​ చేసిన ‘సమోసా’వాలా (Instagram/physicswallah)

ఫిజిక్స్ వాలా అలఖ్ పాండే తరచుగా స్ఫూర్తిదాయక కథలను పంచుకుంటారు. అవి విద్యార్థులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు.. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రాముల్లో ప్రవేశం కోసం నిర్వహించే భారతీయ ప్రవేశ పరీక్ష నీట్ యూజీలో ఉత్తీర్ణుడైన నోయిడాకు చెందిన 18 ఏళ్ల యువకుడి గురించి ఆయన ఒక పోస్ట్​ చేశారు. ఆ యువకుడు సమోసాలు విక్రయిస్తూ నీట్​ యూజీని క్రాక్​ చేసినట్టు తెలిపారు.

ఫిజిక్స్ వాలా రెండు వీడియోలను పంచుకున్నారు. వాటిలో ఒకటి విద్యార్థి సన్నీ కుమార్ గదిని చూపిస్తుంది. కుమార్ గదిలోని గోడలు నోట్లతో ఎలా నిండిపోయాయో చూసి పాండే ఆశ్చర్యపోయారు. కుమార్​ని ప్రశంసించారు.

కేవలం 18 ఏళ్ల వయసులోనే కుమార్ తన చదువును, తన దుకాణాన్ని చక్కదిద్దాడు. మధ్యాహ్నం 2 గంటలకు స్కూల్ ముగించుకుని స్టాల్ నడుపుతూ రాత్రి వరకు చదువుకునేవాడు.

ఆ వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి..

4-5 గంటల పాటు సమోసా స్టాల్​లో పనిచేస్తూ కేవలం ఏడాది ప్రిపరేషన్​తో నీట్ 2024 పరీక్షలో 720కి 664 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు కుమార్​.

ఇదీ చూడండి:- ఉద్యోగం తర్వాత ఇక ఆఫీస్​ కాల్స్​- ఈమెయిల్స్​ పట్టించుకోకండి! ప్రభుత్వం కొత్త చట్టం

"భౌత్ బార్ సరి రాత్ పడాయి కర్తా థా ఫిర్ సుబాహ్ ఆంఖేన్ దర్ద్ కార్తీ థీ" (చాలసార్లు, నేను రాత్రంతా చదువుకున్నాను. ఇది నా కళ్లు నొప్పులొచ్చేవి)," అని నోయిడాకు చెందిన కుమార్ గుర్తు చేసుకున్నాడు.

"దవాయి దేఖ్ కర్ ఇంట్రెస్ట్ అయా, లోగ్ థీక్ కైసే హోతే హై, యే సంజ్నా థా ఇస్లియే బయాలజీ లియా" (మందులు చూడటం ద్వారా నా ఆసక్తి పెరిగింది. ప్రజలు ఎలా నయం అవుతారో తెలుసుకోవాలని నేను కోరుకున్నాను. అందుకే బయోలాజీ ఎంచుకున్నాను)," అని వైద్య రంగంపై తన ఆసక్తి గురించి మాట్లాడుతూ, "సమోసాలు అమ్మడం నా భవిష్యత్తును నిర్దేశించదు," అని అన్నాడు.

సన్నీ కుమార్​ 11వ తరగతి నుంచి ఫిజిక్స్ వాలాలో చదువుకుంటున్నాడు. సన్నీ కష్టాలను గమనించిన అలఖ్ పాండే అతనికి రూ .6 లక్షల స్కాలర్షిప్​ని ఆఫర్ చేశాడు. వైద్య కళాశాల ట్యూషన్ ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు.

సమోసాలు అమ్ముకుంటూ నీట్​ యూజీ క్రాక్​ చేసిన సన్నీ కుమార్​ కథ ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతని కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని చెబుతున్నారు.

మరి సన్నీ కుమార్​ కథపై మీ స్పందన ఏంటి?

ఇంకో విషయం! హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్​లో అందుబాటులో ఉంది. లేటెస్ట్​ వైరల్​, ట్రెండింగ్​ న్యూస్​ కోసం వాట్సాప్​లో హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి!

సంబంధిత కథనం