Russia-Ukraine War: యుద్ధం మొదలైంది.. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం
ప్రపంచ దేశాలు ఏం జరగకూడదని కోరుకున్నాయో అదే జరుగుతుంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈ మేరకు రష్యా సైనికులు.. బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ లోని చాలా భూభాగం.. రష్యా ఆక్రమించుకుంది.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. మిలటరీ ఆపరేషన్ ప్రారంభమైంది. ఇప్పటికే ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ ను మూడు దిక్కుల నుంచి రష్యా చుట్టుముట్టింది. మిలటరీ ఆపరేషన్ ప్రారంభమైనట్లు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన కాసేపటికే.. ఉక్రెయిన్ నుంచి బాంబుల శబ్దాలు వినిపించాయి. ఉక్రెయిన్ లో ముఖ్య నగరాలు.. క్యీవ్, క్రామటోర్స్క్ లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ నగరాల్లో రష్యా యుద్ధ విమానాలు.. బాంబులు వేసినట్టుగా.. అంతర్జాతీయ వార్త సంస్థలు ప్రకటించాయి.ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పరిస్థితిలు నెలకొన్నాయి.
పౌరులను కాపాడటానికి ఈ చర్యలు చేస్తున్నట్టు.. పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ నుంచి వస్తున్న బెదిరింపుల కారణంగానే.. ఈ చర్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఆ దేశాన్ని ఆక్రమించడం అనేది తమ ఉద్దేశం కాదని తెలిపారు. అలాంటి లక్ష్యాలు తమకు ఏమీ లేవని పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్న దానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యత వహించాలన్నారు. రష్యా చేపట్టిన.. చర్యల్లో ఎవరు తలదూర్చినా... తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ చూడని పరిణామాలు చూస్తారని హెచ్చరించారు.
ఉక్రెయిన్లో సైనికీకరణకు వ్యతిరేకంగా మేం పని చేస్తున్నాం. ఎవరూ ఈ విషయంలో కలుగచేసుకోవద్దు. మా ప్రజలకు ముప్పు కలిగించే... ఏ పని చేసినా.. రష్యా నుంచి వెనువెంటనే చర్యలు ఉంటాయి. చరిత్రలో ఎన్నడూ చూడని.. పరిణామాలు జరుగుతాయి.
- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
మరోవైపు రష్యా చర్యలపై అమెరికా స్పందించింది. రష్యా చర్య సరైనది.. కాదని.. ఈ దాడులతో జరిగే.. విధ్వంసానికి.. వారే బాధ్యత వహించాలని పేర్కొంది. అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ఐకమత్యంతో స్పందిస్తుందని.. అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
సంబంధిత కథనం