Ranveer Singh : 'మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి'.. న్యూడ్​ ఫొటోల​పై పోలీసులకు ఫిర్యాదు-ranveer singh nude photo shoot accused of hurting women s sentiments ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ranveer Singh Nude Photo Shoot Accused Of 'Hurting Women's Sentiments'

Ranveer Singh : 'మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి'.. న్యూడ్​ ఫొటోల​పై పోలీసులకు ఫిర్యాదు

Sharath Chitturi HT Telugu
Jul 25, 2022 06:00 PM IST

Ranveer Singh nude photoshoot : న్యూడ్​ ఫొటోషూట్​తో రణ్​వీర్​ సింగ్​ చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. కొందరు.. ఆయనకు వ్యతిరేకంగా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం.

రణ్​వీర్​ సింగ్​
రణ్​వీర్​ సింగ్​ (PAPER magazine )

Ranveer Singh nude photoshoot : తన న్యూడ్​ ఫొటోషూట్​తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు బాలీవుడ్​ నటుడు రణ్​వీర్​ సింగ్​. 'పేపర్​' మ్యాగజైన్​ కోసం ఆయన చేసిన న్యూడ్​ ఫొటోషూట్​ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. చాలా మంది ఆయనకు మద్దతిస్తున్నారు. ఫ్యాన్స్​ మాత్రం రణ్​వీర్​ న్యూడ్​ ఫొటోలు చూసి థ్రిల్​ అయిపోతున్నారు. అయితే.. న్యూడ్​ ఫొటోల వ్యవహారం.. రణ్​వీర్​ సింగ్​ను ఇబ్బందుల్లోకి నెట్టినట్టు తెలుస్తోంది. న్యూడ్​ ఫొటోల విషయంలో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది!

ట్రెండింగ్ వార్తలు

ముంబైలోని ఓ పోలీస్​ స్టేషన్​లో రణ్​వీర్​ సింగ్​ న్యూడ్​ ఫొటోషూట్​పై కొందరు ఫిర్యాదు చేశారు. 'మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఫొటోషూట్​ ఉంది,' అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. ఎవరు ఈ ఫిర్యాదు చేశారో తెలియరాలేదు. ఈ ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లేదు.

Ranveer Singh : రణ్​వీర్​ సింగ్​ న్యూడ్​ ఫొటోషూట్​.. ఇప్పుడు ఒక హాట్​ టాపిక్​. రణ్​వీర్​ని ఏమైనా అంటే.. తాను ఊరుకోనని ప్రముఖ నటి ఆలియా భట్​ తేల్చిచెప్పేశారు. ఇక రణ్​వీర్​ సింగ్​ కొత్త ఫొటోషూట్​కు.. ఆయన భార్య, ప్రముఖ నటి దీపికా పదుకోన్​ ఫిదా అయిపోయారు.

అయితే.. మహిళలు కూడా ఇలాంటి ఫోటోషూట్​ చేస్తే.. సమాజం ఒప్పుకుంటుందా? అని బెంగాలీ నటి మిమి చక్రవర్తి ప్రశ్నించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం