Ranveer Singh: పూర్తి నగ్నంగా రణ్‌వీర్‌ ఫొటోషూట్‌.. ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న ఫొటోలు-bollywood actor ranveer singh nude photoshoot breaking the internet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bollywood Actor Ranveer Singh Nude Photoshoot Breaking The Internet

Ranveer Singh: పూర్తి నగ్నంగా రణ్‌వీర్‌ ఫొటోషూట్‌.. ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న ఫొటోలు

HT Telugu Desk HT Telugu
Jul 22, 2022 09:37 AM IST

Ranveer Singh Nude Photoshoot: బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ నగ్నంగా చేసిన ఫొటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను బ్రేక్‌ చేస్తోంది. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్ ఫొటోషూట్
రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్ ఫొటోషూట్ (Instagram)

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ఏదో ఒక విధంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఈ మధ్యే బేర్‌ గ్రిల్స్‌ షోలో అతనికి ముద్దు పెట్టి దుమారం రేపిన అతడు.. తాజాగా న్యూడ్‌ ఫొటోషూట్‌తో సంచలనం రేపుతున్నాడు. పేపర్‌ అనే మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ కోసం రణ్‌వీర్‌ ఇలా నగ్నంగా ఫొటోలు దిగడం విశేషం. 2014లో ఇదే మ్యాగజైన్‌ కిమ్‌ కర్దాషియాన్‌ షాంపేన్‌ ఫొటోషూట్‌తో ఇంటర్నెట్‌ను బ్రేక్‌ చేసింది.

ఈ లేటెస్ట్‌ ఫొటోల్లో రణ్‌వీర్‌ నగ్నంగా ఓ మ్యాట్‌పై పడుకొని ఫొటోలు దిగాడు. న్యూడ్‌గా డిఫరెంట్ పోజుల్లో అతడు దిగిన ఫొటోలు చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఒకప్పుడు బర్ట్‌ రేనాల్డ్స్‌ ఫొటోషూట్ స్టైల్లోనే ఇప్పుడు రణ్‌వీర్‌ న్యూడ్‌గా కెమెరా ముందు పోజులిచ్చాడు. ఈ మ్యాగజైన్‌కు రణ్‌వీర్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాలు, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు.

"భౌతికంగా నగ్నంగా ఉండటం నాకు చాలా ఈజీ. అయితే ఇప్పటి వరకూ నేను సినిమాల్లో చేసిన పర్ఫార్మెన్స్‌లలోనూ నగ్నంగానే ఉన్నాను. అందులో మీరు నగ్నంగా ఉన్న నా ఆత్మను చూడొచ్చు. నిజానికి అదీ నగ్నత్వం అంటే. నేను వేయి మంది ముందు కూడా నగ్నంగా నిలబడగలను. నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. వాళ్లే కాస్త అసౌకర్యానికి గురవుతారు" అని తన ఇంటర్వ్యూలో రణ్‌వీర్‌ అనడం విశేషం.

ఈ ఫొటోలను ఎంతోమంది ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. గతంలో మరో బాలీవుడ్‌ నటుడు మిలింద్‌ సోమన్‌ కూడా ఇలాగే చేశాడు. దీంతో అతన్ని చూసి రణ్‌వీర్‌ స్ఫూర్తి పొందినట్లున్నాడని కొందరు కామెంట్‌ చేశారు. ఈ ఫొటోలు చూసి దీపికా పదుకోన్‌ ఏమంటుందో అని మరొకరు అన్నారు. రణ్‌వీర్‌ vs వైల్డ్‌ షోతోపాటు బాంద్రాలో ఏకంగా రూ.119 కోట్లు పెట్టి ఇల్లు కొనడం, భార్య దీపికతో కలిసి వెకేషన్‌కు వెళ్లడం వంటి వాటితో ఈ మధ్య తరచూ రణ్‌వీర్‌ వార్తల్లో నిలుస్తున్నాడు.

IPL_Entry_Point