Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ 2 కి నిజాం రాజు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
King Nizam wedding gift to Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ II వివాహం సందర్భంగా హైదరాబాద్ నిజాం రాజు అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి విలువ ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఉంటుంది.
King Nizam wedding gift to Queen Elizabeth II: డైమండ్ నెక్లెస్
క్వీన్ ఎలిజబెత్ II పెళ్లికి హైదరాబాద్ నిజాం రాజు డైమండ్ నెక్లెస్ ను బహుమతిగా ఇచ్చారు. 1947లో క్వీన్ ఎలిజబెత్ II వివాహం సందర్భంగా నిజాం రాజు ఆ నెక్లెస్ ను వివాహ కానుక గా అందించారు. ప్లాటినంతో రూపొందించిన ఆ నెక్లెస్ లో సుమారు 300 వజ్రాలను పొదిగారు.
King Nizam wedding gift to Queen Elizabeth II: లండన్ కార్టియర్ సంస్థ
క్వీన్ ఎలిజబెత్ II వివాహం సందర్భంగా తన తరఫున కానుకగా ఆమె కోరుకున్న ఖరీదైన ఆభరణాలను అందించాల్సిందిగా లండన్ లోని ప్రఖ్యాత జ్యుయెలరీ సంస్థ కార్టియర్ ను నిజాం రాజు కోరారు. దాంతో, ఖరీదైన వివిధ డిజైన్ల ఆభరణాలను ఆ సంస్థ ప్రతినిధులు క్వీన్ కు చూపించారు. అప్పుడు ఎలిజబెత్ ఈ 300 వజ్రాలు పొదిగిన ప్లాటినం నెక్లెస్ ను ఎంపిక చేసుకున్నారు. అప్పటికి ఆమె మహారాణిగా బాధ్యతలు చేపట్టలేదు. 1952 లో తండ్రి కింగ్ జార్జ్ 6 మరణానంతరం ఆమె క్వీన్ గా బాధ్యతలు చేపట్టారు.
King Nizam wedding gift to Queen Elizabeth II: ఖరీదైన ఆభరణాల్లో ఒకటి
క్వీన్ ఎలిజబెత్ II వద్ద ఖరీదైన ఆభరణాలకు కొదువ లేదు. వాటిలో ఆమెకు ఎంతో ఇష్టమైన ఆభరణం నిజాం రాజు బహూకరించిన ఈ డైమండ్ నెక్లెస్. ఈ నెక్లెస్ ను ధరించి ఆమె చాలా ఫొటోలు దిగారు. ఆ తరువాత కొన్నాళ్లకు ఆమె ఈ నెక్లెస్ ను కేంబ్రిడ్జ్ యువరాణి కేట్ మిడిల్ టన్ కు ఇచ్చారు.
King Nizam wedding gift to Queen Elizabeth II: క్వీన్ మరణం
96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ II గురువారం మధ్యాహ్నం మరణించిన విషయం తెలిసిందే. 1952 నుంచి 2022 వరకు దాదాపు 12 దేశాలకు మహారాణిగా ఆమె వ్యవహరించారు. 1952లో 25 ఏళ్ల చిన్న వయస్సులోనే ఆమె మహారాణి బాధ్యతలు చేపట్టారు. తన మంచితనం, వ్యవహార శైలితో అందరి మన్ననలు పొందారు. క్వీన్ ఎలిజబెత్ II మరణం అనంతరం ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ కింగ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.