PM Modi hectic trip: ‘‘90 గంటలు.. 10 వేల కిమీలు.. 4 రాజధానులు.. 10 బహిరంగసభలు’’
PM Modi hectic trip: నాలుగు రోజులు, అంటే 90 గంటల కన్నా తక్కువ సమయంలో రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా కిమీలను ప్రధాని మోదీ ప్రయాణించనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (HT_PRINT)
PM Modi hectic trip: నాలుగు రోజులు.. సుమారు 90 గంటలు.. 10,800 కిలోమీటర్లు.. నాలుగు రాజధానులు.. 10 బహిరంగ సభలు. ప్రధాని మోదీ శుక్రవారం నుంచి పాల్గొనే కార్యక్రమాల వివరాలు ఇవి. 90 గంటల లోపే, ప్రధాని మోదీ త్రిపుర రాజధాని అగర్తల నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబై వరకు.. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి కర్నాటక రాజధాని బెంగళూరు వరకు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.
PM Modi hectic trip: పూర్తి షెడ్యూల్ ఇదే..
శుక్రవారం (Friday)
- ఉదయం ప్రధాని మోదీ (PM Modi) ఢిల్లీ నుంచి బయల్దేరారు. యూపీ రాజధాని లక్నో చేరుకుని అక్కడ ఉత్తర ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును (Uttar Pradesh Global Investors Summit 2023) ప్రారంభించారు.
- అక్కడి నుంచి నేరుగా మహారాష్ట్ర రాజధాని ముంబై వెళ్లారు. అక్కడ రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ (vande Bharat express) రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అక్కడే కొన్ని రోడ్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అనంతరం ముంబైలో ఏర్పాటు చేసిన Aljamea-tus-Saifiyah కొత్త క్యాంపస్ ను ప్రారంభించారు. శుక్రవారం రాత్రి తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ప్రధాని మోదీ కవర్ చేసిన మొత్తం దూరం 2700 కిలోమీటర్లు.
శనివారం (Saturday)
- త్రిపుర అసెంబ్లీ ఎన్నికల (Tripura assembly elections) ప్రచారంలో పాల్గొనడం కోసం శనివారం ఉదయం త్రిపుర రాజధాని అగర్తల (Agartala)కు వెళ్లారు. అక్కడ అంబస్స, రాధాకిషోర్ పూర్ లలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. రాత్రికి మళ్లీ ఢిల్లీ చేరుకుంటారు. ప్రధాని మోదీ శనివారం ప్రయాణించిన దూరం సుమారు 3000 కిమీలు.
ఆదివారం (Sunday)
- ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉదయం మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి ఉత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
- అక్కడి నుంచి రాజస్తాన్ లోని దౌసా (Dausa, Rajasthan)కు వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే రెండు బహిరంగ సభల్లో పాల్గొంటారు.
- అక్కడి నుంచి నేరుగా కర్నాటక రాజధాని బెంగళూరు (Bengaluru) కు వెళ్తారు. ఆదివారం ప్రధాని మోదీ ప్రయాణించిన దూరం సుమారు 1750 కిలోమీటర్లు.
సోమవారం (Monday)
- ఫిబ్రవరి 13, సోమవారం ఉదయం బెంగళూరు (Bengaluru) లో Aero India 2023 ని ప్రధాని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మళ్లీ త్రిపుర రాజధాని అగర్తల (Agartala) వెళ్తారు. అక్కడ రెండు ఎన్నికల ప్రచార సభల్లో (Tripura assembly elections) పాల్గొంటారు. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. మొత్తంగా సోమవారం ప్రధాని మోదీ ప్రయాణించే దూరం సుమారు 3,350 కిలోమీటర్లు.
- అంటే, శుక్రవారం ఉదయం నుంచి సోమవారం రాత్రి వరకు ప్రధాని మోదీ మొత్తంగా సుమారు 10,800 కిమీల దూరం ప్రయాణిస్తారు. నాలుగు రాష్ట్రాల రాజధానుల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10 కార్యక్రమాల్లో ప్రసంగిస్తారు.