Pilot threatens to crash stolen aircraft: `విమానంతో వాల్ మార్ట్ స్టోర్ లోకి`
Pilot threatens to crash stolen aircraft: మిసిసిప్పి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడో దొంగ పైలట్. దొంగలించిన విమానంతో వాల్ మార్ట్ స్టోర్ లోకి దూసుకెళ్తానని హెచ్చరించి పరుగులు పెట్టించాడు.
Pilot threatens to crash stolen aircraft:దొంగతనం చేసిన ఒక చిన్న విమానంతో మిసిసిపిలోని టుపెలో పట్టణంపై చక్కర్లు కొట్టిన ఒక దుండగుడు ఆ విమానాన్ని టుపెలో లోని ఒక వాల్ మార్ట్ స్టోర్ లో కూల్చేస్తానని హెచ్చరించాడు.
Pilot threatens to crash stolen aircraft: పోలీసుల అప్రమత్తత
మొదట ఈ హెచ్చరికను పెద్ధగా పట్టించుకోని పోలీసులు.. నిజంగానే ఆ దుండగుడు విమానంతో టుపెలొ గగన తలంపై చక్కర్లు కొట్టడాన్ని గుర్తించి, అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ వాల్ మార్ట్ లోని సిబ్బంది, వినియోగదారులను బయటకు పంపించేశారు. దగ్గర్లోని ఇతర భవనాల్లోని ప్రజలను కూడా సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఆ ప్రాంతంలో భద్రత పెంచారు. ఆ పైలట్ తో సంప్రదింపులు జరపడం ప్రారంభించారు.
Pilot threatens to crash stolen aircraft: ఏర్పోర్ట్ అథారిటీ ఉద్యోగే..
విమానాన్ని దొంగలించి వాల్ మార్ట్ స్టోర్ లో కూల్చేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడు టుపెలొ రీజనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఉద్యోగేనని, ఉద్యోగంలో సమస్యతో ఈ పని చేశాడని గుర్తించారు. ఆ విమానం కూడా 9 సీట్ల మినీ 2 ఇంజిన్ 1987 బీచ్ సీ 90 ఏ విమానమని నిర్ధారించారు. టుపెలొ గగనతలంపై దాదాపు 3 గంటల పాటు చక్కర్లు కొట్టిన విమానం ఆ తరువాత పశ్చిమంగా వెళ్లి టొయొటా వాహన ఉత్పత్తి కేంద్రంపై చక్కర్లు కొడుతున్నట్లు గుర్తించారు.