Parliament Winter Session : డిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
Parliament Winter Session 2022 : డిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. డీసెంబర్ 29తో ముగియనున్నాయి.
Parliament winter session 2022 schedule dates : ఈ ఏడాది.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7న ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
డిసెంబర్ 7న మొదలయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. అదే నెల 29న ముగియనున్నాయి. మొత్తం మీద ఈసారి శీతాకాల సమావేశాలు.. 17 రోజుల పాటు జరగనున్నాయి.
"2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 7 నుంచి 29 వరకు జరుగుతాయి. 23 రోజుల వ్యవధిలో 17 సిట్టింగ్స్ ఉంటాయి. వివిధ అంశాలపై చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నాము. నిర్ణయాత్మక చర్చలు సాగుతాయని ఆశిస్తున్నాము," అని కేంద్రం మంత్రి ట్వీట్ చేశారు.
పలువురు సిట్టింగ్ ఎంపీల మృతిపై సంతాపం తెలుపుతూ.. తొలి రోజు కార్యకలాపాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఇటీవల మరణించిన సిట్టింగ్ ఎంపీల్లో ఎస్పీ దిగ్గజ నేత ములాయం సింగ్ యాదవ్ కూడా ఉన్నారు.
కొవిడ్ రూల్స్ లేకుండా..
Parliament winter session 2022 : కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో.. 2020 నుంచి ఆంక్షల వలయంలోనే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే.. ఈసారి రూల్స్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుతుండటం, పార్లమెంట్ సిబ్బంది పూర్తిగా టీకాలు వేసుకోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే.. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
రాజ్యసభకు ఇంతకాలం ఛైర్మన్గా విధులు నిర్వహించిన వెంకయ్య నాయుడు.. వర్షకాల సమావేశాల్లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత.. జగ్దీప్ ధన్ఖర్.. ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాజ్యసభ ఛైర్మన్ బాధ్యతలు తీసుకోనున్నారు.
వివిధ బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే సమయంలో.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి.
వర్షాకాల సమావేశాలు..
Parliament Monsoon session 2022 : 2022 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. జులై 18- ఆగస్టు 8 మధ్య జరిగాయి. 22 రోజుల్లో 16 సెషన్స్ జరిగాయి. సమావేశాల్లో భాగంగా లోక్సభలో ఆరు బిల్లులను ప్రవేశపెట్టింది కేంద్రం. మొత్తం మీద 7 బిల్లులు లోక్సభలో గట్టెక్కాయి. రాజ్యసభలో 5 బిల్లులకు ఆమోదం లభించింది. ఒక బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది.
గత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్సభ ఉత్పాదకత 48శాతం, రాజ్యసభ ఉత్పాదకత 44శాతంగా నమోదైంది.
సంబంధిత కథనం