Parliament monsoon session : ‘నారీ శక్తి’కి చిహ్నం.. ఈ చిత్రం!
Parliament monsoon session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మహిళా ఎంపీలు ఒక్కచోటకు చేరారు. అందరు కలిసి ఫొటో దిగారు.
Parliament monsoon session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ 'నారీ శక్తి' ఒక్కచోటుకు చేరింది. సోమవారం పార్లమెంట్ సెషన్ ప్రారంభం కాగా.. మహిళా ఎంపీలు అందరు కలిశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఫొటోలు దిగారు. వీరిలో ఎస్పీ ఎంపీ జయా బచ్చన్, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఎన్సీపీకి చెందిన సుప్రియ సులే కూడా ఉన్నారు.
"పార్లమెంట్ సెంట్రల్ హాల్లో స్త్రీ శక్తి. తిరిగిరావడం(పార్లమెంట్‌కు) చాలా సంతోషంగా ఉంది," అని ఎన్సీపీ ఎంపీ ఫౌజియా ఖాన్ ట్వీట్ చేశారు.
ఉభయ సభలు వాయిదా..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తొలి రోజు ఓ కీలక ఘట్టం ముగిసింది. రాష్ట్రపతి ఎన్నికకు సాయంత్రం 5 గంటలతో తెరపడింది.
ఇదిలా ఉండగా.. ఉభయ సభలు తొలిరోజే వాయిదా పడ్డాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వ్యూహాలను తొలిరోజే అమలు చేశాయి విపక్షాలు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు, అగ్నిపథ్ పథకం నేపథ్యంలో తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు విపక్ష ఎంపీలు. ఫలితంగా లోక్‌సభ, రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడ్డాయి.
అంతకుముందు.. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వారిలో ఉన్న భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. సోమవారం ప్రమాణం చేశారు. అనంతరం రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేశారు.
సంబంధిత కథనం