Pakistan bomb blast : పోలియో డ్రైవ్ లక్ష్యంగా బాంబు దాడి.. ఆరుగురు మృతి- 22మందికి గాయాలు
Pakistan bomb blast today : పోలియో డ్రైవ్‌ని నిలిపివేయడమే లక్ష్యంగా.. పాకిస్థాన్‌లో జరిగిన బాంబు దాడిలో ఆరుగురు మరణించారు. మరో 22మంది గాయపడ్డారు.
Pakistan bomb blast today : బాంబు దాడితో పాకిస్థాన్ మరోమారు ఉలిక్కిపడింది. పోలియో డ్రైవ్‌కు భద్రత కల్పించేందుకు వెళుతున్న భద్రతా బృందమే లక్ష్యంగా జరిగిన ఈ బాంబు పేలుడు ఘటనలో.. ఆరుగురు పోలీసులు మరణించారు. మరో 22మంది గాయపడ్డారు.
పాకిస్థాన్‌లో బాంబు పేలుడు..
పాకిస్థాన్ ఖైబర్ పంఖ్తుక్వా రాష్ట్రంలోని బజౌర్ జిల్లాలో సోమవారం జరిగింది ఈ ఘటన. ఆ ప్రాంతంలో పోలియో డ్రైవ్ చేపట్టారు. డ్రైవ్‌లోని సభ్యులకు భద్రతను కల్పించేందుకు పోలీసు సిబ్బంది ఓ వ్యాన్ ఎక్కిన కొన్ని క్షణాలకే భారీ పేలుడు శబ్దం విపించింది. ఇతరులు అక్కడికి వెళ్లి చూడగా.. ఆరుగురు మృతదేహాలు లభించాయి. వారందరు పోలీసులే! ఘటనలో గాయపడిన 22మందిని అధికారులు.. ఆసుపత్రికి తరలించారు.
Pakistan bomb blast : టీకాలను ఉగ్రవాదులు వ్యతిరేకిస్తారు. అందుకే.. పోలియో డ్రైవ్స్‌పై దాడులు చేస్తూ ఉంటారు. పాకిస్థాన్ తాలిబన్ ఇస్లామిస్ట్ మిలిటెంట్ల్ బృందం.. తరచూ ఇలాంటి వ్యాక్సినేషన్ డ్రైవల్పై దాడి చేస్తుంది. సోమవారం కూడా అదే జరుగుతుందన్న భయంతో పోలీసుల భద్రతను కోరారు అధికారులు. ఎంత భద్రత ఉన్నా.. మళ్లీ బాంబు పేలుడు సంభవించడం గమనార్హం. తాజా ఘటనకు ఎవరు కారణం? అన్న వివరాలు తెలియరాలేదు.
కాగా.. ఈ ఘటపై ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేపీకే అర్షన్ హుస్సెన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. "చిట్టచివరి ఉగ్రవాదిని మట్టుబెట్టేంత వరకు.. ఉగ్రవాదంపై తమ పోరాటం కొనసాగుతుంది," అని వ్యాఖ్యానించారు.
Bomb blast near polio vaccination drive : పాకిస్థాన్‌లో తాజా బాంబు పేలుడు ఘటనపై పోలీసు అధికారులు స్పందించారు. "ఇలాంటి దాడులతో తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ప్రజల రక్షణ కోసం పోలీసులు చేసిన ప్రాణ త్యాగం చరిత్రలో గుర్తుండి పోతుంది," అని బలంగా చెప్పారు.
పాకిస్థాన్‌లో బాంబు దాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. పోలీసు సిబ్బందిపైనా దాడులు ఎక్కువ అవుతున్నాయి. గత నవంబర్‌లో, పాకిస్థాన్ టాంక్ ప్రాంతంలో జరిగిన ఓ ఉగ్రదాడిలో ముగ్గురు పోలీసులు మరణించారు. ఓ మహిళను కిడ్నాప్ చేసిన వారిని పట్టుకునేందుకు వెళుతుండగా.. ఈ దాడి జరిగింది!
సంబంధిత కథనం