ONGC Recruitment: 10, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హతతో ఓఎన్జీసీలో అప్రెంటిస్ జాబ్స్
ONGC Recruitment: ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీలో అప్రెంటిస్ జాబ్స్ కు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 2500 అప్రెంటిస్ పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ONGC Recruitment: ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ONGC) లో అప్రెంటిస్ జాబ్స్ కు నోటిఫికేషన్ వెలువడింది. వివిధ కేటగిరీల్లో మొత్తం 2500 అప్రెంటిస్ పోస్ట్ లను ఓఎన్జీసీ భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ongcindia.com. వెబ్ సైట్ ద్వారా అప్లై చేయొచ్చు.
లాస్ట్ డేట్ సెప్టెంబర్ 20
ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 20. మొత్తం 2500 అప్రెంటిస్ పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 5 తేదీ నాటికి మొత్తం సెలక్షన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు 2023, సెప్టెంబర్ 20 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఒకే కేటగిరీకి చెందిన ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే, ఎక్కువ వయస్సు ఉన్నవారిని ఎంపిక చేస్తారు.
వేకెన్సీ, విద్యార్హతల వివరాలు..
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - బీఏ/బీకాం/బీఎస్సీ/బీబీఏ/బీఈ/బీటెక్
- డిప్లొమా అప్రెంటిస్ - ఏదైనా డిప్లోమా
- ట్రేడ్ అప్రెంటిస్ - 10వ తరగతి/ఇంటర్మీడియట్/ఐటీఐ
- Detailed Notification Here