New Omicron subvariant may cause fresh wave: కొత్త వేరియంట్ తో మరో ‘వేవ్’ ముప్పు-new omicron subvariant may cause fresh wave who chief scientist ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  New Omicron Subvariant May Cause Fresh Wave: Who Chief Scientist

New Omicron subvariant may cause fresh wave: కొత్త వేరియంట్ తో మరో ‘వేవ్’ ముప్పు

HT Telugu Desk HT Telugu
Oct 21, 2022 06:29 PM IST

New Omicron subvariant may cause fresh wave: ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBBతో కొన్ని దేశాల్లో మరో కరోనా వేవ్ వచ్చే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్ ను భారత్ లోని కేరళ, మహారాష్ట్రల్లో ఇప్పటికే గుర్తించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT file)

New Omicron subvariant may cause fresh wave: కరోనా ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ XBB తో ముప్పు తప్పకపోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లో చీఫ్ సైంటిస్ట్ గా పని చేస్తున్న భారత సంతతికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ దీనిపై స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు

New Omicron subvariant may cause fresh wave: పూర్తి డేటా లేదు..

XBB సబ్ వేరియంట్ ఇప్పటివరకు వచ్చిన వేరియంట్ల కన్నా వేగంగా వ్యాప్తి చెందగలదని, వ్యక్తుల రోగ నిరోధక శక్తిని తప్పించుకుని వ్యాధిని తీవ్రం చేయగలదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వేరియంట్ కారణంగా సింగపూర్ లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దీనిపై డాక్టర్ స్వామినాథన్ స్పందిస్తూ.. XBB సబ్ వేరియంట్ వ్యాప్తి, వ్యాధి తీవ్రతకు సంబంధించి ఇప్పటివరకు పూర్తి స్థాయి క్లినికల్ డేటా రాలేదన్నారు. అందువల్ల, ఈ వేరియంట్ గతంలో వచ్చిన వేరియంట్ల కన్నా ప్రమాదకారి అని చెప్పలేమన్నారు.

New Omicron subvariant may cause fresh wave: BA.5 BA.1 పై కూడా..

XBB సబ్ వేరియంట్ తో పాటు భారత్ లోని మహారాష్ట్ర, కేరళల్లో గుర్తించిన BA.5 BA.1 సబ్ వేరియంట్ల వ్యాప్తి పై కూడా WHO దృష్టి పెట్టిందని ఆమె వివరించారు. ఒమిక్రాన్ కు సంబంధించి ఇప్పటివరకు 300 సబ్ వేరియంట్స్ ను గుర్తించారు. అయతే, వీటిలో తాజాగా గుర్తించిన XBB సబ్ వేరియంట్ రీకాంబినెంట్ వైరస్. ఇది మనుషుల రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకోగలదు. అంటే, మనుషుల్లోని యాంటీ బాడీస్ దీనిపై పెద్దగా పని చేయవు. అందువల్ల, ఈ సబ్ వేరియంట్ కారణంగా మరో వేవ్ కు అవకాశముందని భావిస్తున్నామని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు.

New Omicron subvariant may cause fresh wave: పండుగ సీజన్ తో జాగ్రత్త..

పండుగ సీజన్ లో ఈ వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశముందని, అందువల్ల ప్రజలంతా కచ్చితంగా కరోనా ప్రొటోకాల్ ను పాటించాలని ఇప్పటికే కేంద్రం మార్గ దర్శకాలను విడుదల చేసింది. మాస్క్ ను కచ్చితంగా ధరించాలని సూచించింది.

IPL_Entry_Point

టాపిక్