New Maruti Suzuki Ertiga | బుకింగ్స్ ప్రారంభం.. వచ్చే వారమే లాంఛ్
మారుతీ సుజుకీ ఎర్టిగా సరికొత్తగా ముస్తాబైంది. వచ్చే వారమే లాంఛ్ కానుంది. అయితే బుకింగ్స్ ప్రారంభించినట్టు మారుతీ సుజుకీ సంస్థ తెలిపింది.
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన మల్టీ పర్పస్ వెహికల్ ఎర్టిగా కొత్త వెర్షన్ కోసం బుకింగ్ ప్రారంభించినట్లు గురువారం ప్రకటించింది.
స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే నెక్స్ట్-జెన్ ఎర్టిగా వచ్చే వారం విడుదల కానుంది. రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఎర్టిగా 7.5 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైందని, భారతదేశపు ఎంపీవీ మార్కెట్‌లో గేమ్-ఛేంజర్ అని అన్నారు.
‘నెక్స్ట్ జనరేషన్ ఎర్టిగాలో ఆలోచనాత్మకమైన నూతన ఫీచర్లు, అప్‌గ్రేడ్ చేసిన పవర్‌ట్రెయిన్, అధునాతన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటాయి’ అని ఆయన చెప్పారు.
ఇది వినియోగదారులకు వారి ప్రియమైన వారితో కలిసి సుదీర్ఘ ప్రయాణాలకు వీలు కల్పిస్తుందని, మరింత ఇంధన-సమర్థవంతమైన, శక్తివంతమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన కారుగా తోడు ఉంటుందని ఆయన తెలిపారు.
కొత్త ఎర్టిగా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, సుజుకి కనెక్ట్, 7-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తుందని కంపెనీ తెలిపింది.
సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. మారుతీ సుజుకీ సంస్థ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (ఇంజనీరింగ్) సీవీ రామన్ మాట్లాడుతూ, నెక్స్ట్-జెన్ ఎర్టిగాలో సరికొత్త కె-సిరీస్ ఎఫెక్టివ్ పవర్‌ట్రెయిన్ సహా ఆధునిక ఫీచర్లతో సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని పొందవచ్చని అన్నారు.
టాపిక్