Navodaya Vidyalaya Admission 2023: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల ప్రాసెస్ ప్రారంభం: ఆన్‍లైన్ అప్లై, ఆఖరు తేదీ వివరాలు-navodaya vidyalaya admission 2023 applications begins on navodaya gov in know important dates process ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Navodaya Vidyalaya Admission 2023: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల ప్రాసెస్ ప్రారంభం: ఆన్‍లైన్ అప్లై, ఆఖరు తేదీ వివరాలు

Navodaya Vidyalaya Admission 2023: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల ప్రాసెస్ ప్రారంభం: ఆన్‍లైన్ అప్లై, ఆఖరు తేదీ వివరాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 03, 2023 12:52 PM IST

Navodaya Vidyalaya Admission 2023: నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్‍ల కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఆన్‍లైన్‍లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇవే.

Navodaya Vidyalaya Admission 2023: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల ప్రాసెస్ ప్రారంభం: ఆన్‍లైన్ అప్లై, ఆఖరు తేదీ వివరాలు ఇవే
Navodaya Vidyalaya Admission 2023: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల ప్రాసెస్ ప్రారంభం: ఆన్‍లైన్ అప్లై, ఆఖరు తేదీ వివరాలు ఇవే

Navodaya Vidyalaya Admission 2023: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి అడ్మిషన్లను ప్రారంభించింది నవోదయ విద్యాలయ సమితి (NVS). నవోదయ విద్యాలయాల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులు ఆన్‍లైన్‍లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. navodaya.gov.in వెబ్‍సైట్‍లో అడ్మిషన్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్, ఎగ్జామ్ తేదీ, అప్లయ్ ప్రాసెస్‍తో పాటు మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Navodaya Vidyalaya Admission 2023: ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‍సైట్ navodaya.gov.inకు వెళ్లాలి.
  • హోమ్ పేజీలో జేఎన్‍వీ క్లాస్ సిక్స్త్ అడ్మిషన్ లింక్ (JNV Class 6th admission link) కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత లాగిన్/రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
  • NVS అడ్మిషన్ పోర్టల్‍లో వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • వివరాల సమర్పణతో పాటు కొన్ని డాక్యుమెంట్లను కూడా అప్‍లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • అన్ని వివరాలు నమోదు చేశాక.. అప్లికేషన్‍ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ఆ అప్లికేషన్‍ను ప్రింట్ ఔట్ తీసుకోవాలి.

ఈ నెలాఖరు అంటే జనవరి 31 తేదీ దరఖాస్తుకు తుది గడువుగా ఉంది. ఆలోగా అప్లై చేసుకోవాలి.

JNVST 2023 Exam Date: పరీక్ష తేదీ

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023కు గాను 6వ తరగతి అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎంపిక పరీక్షకు హాజరు కావాలి. ఈ ఏడాది ఏప్రిల్ 29న ఉదయం 11.30 గంటలకు పరీక్ష ఉంటుంది. జూన్‍లో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

Navodaya Vidyalaya Admission 2023: అర్హత

2022-23 విద్యా సంవత్సరం అంటే ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశం కోసం ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. 2011 మే 01 నుంచి 2013 ఏప్రిల్ 30 తేదీ మధ్య జన్మించిన పిల్లలు ప్రస్తుతం 6వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

IPL_Entry_Point

టాపిక్