National emblem atop new Parliament: ‘సింహం బొమ్మలో క్రూరత్వం’ కేసు కొట్టివేత
National emblem atop new Parliament: కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం సింహం బొమ్మ క్రూరంగా ఉందని, దాన్ని తొలగించేలా ఆదేశించాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.
National emblem atop new Parliament: ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన సింహం బొమ్మ క్రూరంగా ఉందని, దాన్ని తొలగించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
National emblem atop new Parliament: క్రూరంగా ఉంది..
National emblem atop new Parliament: జాతీయ చిహ్నంగా ఉన్న సింహం బొమ్మ ను అశోక చక్రవర్తి ఏర్పాటు చేసిన సారానాథ్ స్థూపం నుంచి స్ఫూర్తిగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, కొత్త పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన సింహం బొమ్మ సారనాథ్ స్థూపంపై ఉన్న సింహంలా సాత్వికంగా లేదని, ఈ బొమ్మను మరింత క్రూరంగా, కోరలు కనిపించేలా రూపొందించారని ఆల్డనీశ్ రీన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇది జాతీయ చిహ్నాల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన వాదించారు.
National emblem atop new Parliament: అలా ఏమీ లేదు..
ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం పిటిషన్ దారు వాదనతో ఏకీభవించలేదు. ఆ చిహ్నాన్ని చూసేవారి దృష్టి కోణాన్ని బట్టి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఇది జాతీయ చిహ్నాల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడంగా తాము బావించడం లేదని స్పష్టం చేసింది.
National emblem atop new Parliament: విపక్షాల గొడవ
ఒక ఎత్తైన స్థూపంపై నాలుగు వైపులా సింహం ముఖం ఉండేలా సారనాథ్ చిహ్నం ఉంటుంది. ప్రస్తుతం అది సారనాథ్ లోని మ్యూజియంలో ఉంది. ఈ చిహ్నం స్ఫూర్తిగా కొత్త సింహం ముఖాన్ని రూపొందించలేదని, కొత్త పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన సింహం భయం గొల్పేలా ఉన్నదని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శించాయి. పార్లమెంటు భవనంపై ఈ చిహ్నాన్ని జులై 11న ప్రధాని మోదీ ఆవిష్కరించారు.