South Africa nightclub : 21 మృతదేహాలు.. ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు!
South Africa nightclub : దక్షిణాఫ్రికా నైట్ క్లబ్లో 21మంది టీనేజర్ల మరణంపై ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు వారందరు ఎలా మరణించారు? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
South Africa nightclub : దక్షిణాఫ్రికా 'నైట్ క్లబ్' ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నైట్ క్లబ్లో 21మంది టీనేజర్ల మరణం.. అధికారులకు ఓ మిస్టరీగా మిగిలిపోయింది. అసలు దక్షిణాఫ్రికా నైట్ క్లబ్లో వారు ఎలా మరణించారు? అన్న విషయం ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. ఫలితంగా ఈ పూర్తి వ్యవహారం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది.
13-17ఏళ్లలోపు వారే..!
తూర్పు కేప్ రాష్ట్రంలోని తూర్పు లండన్ ప్రాంతంలో ఉన్న ఎన్యోబెని టావెర్న్ నైట్ క్లబ్లో.. శనివారం రాత్రి పార్టీ చేసుకునేందుకు వెళ్లారు 21మంది టీనేజర్లు. వారి వయస్సు 13-17ఏళ్ల మధ్యలో ఉంటుంది. వారందరు మద్యం సేవించారు.
దక్షిణాఫ్రిక నైట్ క్లబ్ ఘటన జరిగిన కొన్ని గంటల అనంతరం.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. టీనేజర్లు స్పృహ తప్పి పడిపోయారని ఫోన్లో చెప్పారు. ఘటనాస్థలానికి పరుగులు తీసిన పోలీసులు.. అక్కడి పరిస్థితులు చూసి షాక్ అయ్యారు. దక్షిణాఫ్రికా నైట్ క్లబ్‌లోని టేబుళ్లు, కుర్చీలు, నేల మీద టీనేజర్లు పడిపోయి ఉన్నారు. వారిలో 18మంది అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. మరో టీనేజర్.. స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండా మృతిచెందాడు. మరో ఇద్దురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Night club deaths East London : ఆ దక్షిణాఫ్రికా నైట్ క్లబ్లో తొక్కిసలాట వల్లే ఈ ఘటన జరిగిందని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ పోలీసులు అవి అవాస్తవమని తేల్చిచెప్పారు. తొక్కిసలాటకు సంబంధించిన గాయాలేవీ మృతదేహాలపై కనిపించలేదని అన్నారు. అసలు వారి మృతదేహాలపై గాయాలేవీ లేవని తేల్చారు.
ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు అక్కడి పరిస్థితులు చూసి మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు!
"మీరు ఎంత ధైర్యవంతులైనా.. నేను చూసిన దృశ్యాలను చూస్తే కచ్చితంగా బాధ కలుగుతుంది. దక్షిణాఫ్రికా నైట్ క్లబ్లో పడి ఉన్న మృతదేహాలను చూస్తే కంటతడి వచ్చింది. వాళ్ల ముఖాలు చూస్తే.. అందరు చిన్నపిల్లలే అన్న విషయం తెలిసి ఇంకా బాధగా ఉంది. 21మంది.. అందరు ప్రాణాలు కోల్పోయారు," అని పోలీస్‌శాఖకు చెందిన సేలే అన్నారు.
ఎలా చనిపోయారు?
కాగా.. దక్షిణాఫ్రికా నైట్ క్లబ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ టీనేజర్లు అసలు ఆ నైట్ క్లబ్‌కు ఎందుకు వెళ్లారు? అన్న విషయంపై వారికి స్పష్టత వచ్చింది.
South Africa news : "వారికి అప్పుడే.. మిడ్- ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. స్థానిక డీజే పుట్టిన రోజు కూడా ఆరోజే. పైగా.. దక్షిణాఫ్రికాలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేశారు. అందుకే అన్నింటిని కలిపి పార్టీ చేసుకునేందుకు వారు నైట్ క్లబ్‌కు వెళ్లారు," అని అధికారులు అన్నారు.
కానీ వారి మరణానికి గల అసలు కారణం మాత్రం అంతుచిక్కడం లేదు.
"దక్షిణాఫ్రికా నైట్ క్లబ్లో టీనేజర్లు అందరు మద్యం సేవించారు. హుక్కా తీసుకున్నారు. వాటిల్లో విష పదార్థాలు ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేస్తున్నాము. విష పదార్థల వల్లే టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారా? అన్న విషయం తెలుసుకోవాల్సి ఉంది. సాంపిల్స్‌ను టాక్సికాలజీ ల్యాబొరేటరీకి పంపించాము. కానీ ఆ రిపోర్టులు రావడానికి చాలా సమయం పడుతుంది," అని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు ఆసుపత్రిలో హృదయవిదారక పరిస్థితులు దర్శనమిచ్చాయి. మృతదేహాలను గుర్తించేందుకు పిల్లల తల్లిదండ్రులను పిలిపించారు. విగతజీవులుగా పడి ఉన్న బిడ్డలను చూసి తల్లిదండ్రులు విలపించారు.
మద్యం ఎలా దొరికింది?
Enyobeni Tavern disaster 2022 : వాస్తవానికి దక్షిణాఫ్రికాలో 18ఏళ్లలోపు యువత మద్యం సేవించడం నిషేధం. కానీ దక్షిణాఫ్రికా నైట్ క్లబ్లో మరణించివారు మద్యం సేవించారని రుజువైంది. దీనిపై సర్వత్రా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. నైట్ క్లబ్స్‌ను మూసివేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. దక్షిణాఫ్రికా నైట్ క్లబ్‌లు లిక్కర్ చట్టాలను పాటించడం లేదని మండిపడుతున్నారు తల్లిదండ్రులు.
సంబంధిత కథనం