IMD weather : మే నెలలో.. తెలంగాణ, ఆంధ్రపై హీట్​వేవ్​ ప్రభావం ఎక్కువే!-mixed weather in store for india next month says imd amid heatwave concerns ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imd Weather : మే నెలలో.. తెలంగాణ, ఆంధ్రపై హీట్​వేవ్​ ప్రభావం ఎక్కువే!

IMD weather : మే నెలలో.. తెలంగాణ, ఆంధ్రపై హీట్​వేవ్​ ప్రభావం ఎక్కువే!

Sharath Chitturi HT Telugu
Apr 29, 2023 06:20 AM IST

IMD weather : మే నెలకు సంబంధించిన ఔట్​లుక్​ను విడుదల చేసింది ఐఎండీ. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో హీట్​వేవ్​ ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.

కొంచెం ఎండ.. కొంచెం వాన- మే నెలలో దేశం పరిస్థితి ఇది!
కొంచెం ఎండ.. కొంచెం వాన- మే నెలలో దేశం పరిస్థితి ఇది! ((PTI))

IMD weather : మే నెల వస్తోందంటే చాలు.. భానుడి భగభగల గుర్తు తెచ్చుకుని ప్రజలు భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణశాఖ (ఐఎండీ) కీలక అప్డేట్​ ఇచ్చింది. వాయువ్య- పశ్చిమ- మధ్య భారతంలో మే నెలలో సాధారణం లేదా సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఫలితంగా హీట్​వేవ్​ ప్రభావిత ప్రాంతాల్లో జీవిస్తున్న లక్షలాది మంది ప్రజలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొంది. అదే సమయంలో.. భారీ ఉష్ణోగ్రతలు కనిపించని ప్రాంతాల్లో మాత్రం హీట్​వేవ్​ ప్రభావం ఈసారి ఎక్కువగానే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు.. మే నెలకు సంబంధించిన ఔట్​లుక్​ను విడుదల చేసింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

IMD weather forecast in May 2023 : ఐఎండీ ప్రకారం.. వాయువ్యం, పశ్చిమ- మధ్య భారతంలో వర్షపాతం.. సాధారణం లేదా సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతుంది. తూర్పు, తూర్పు- మధ్య, ఈశాన్య, ద్వీపకల్పం (పెనున్సులార్​)లోని ప్రాంతాల్లో హీట్​వేవ్​.. సాధారణం కన్నా ఎక్కువ రోజులు ఉంటుంది. మేలో బిహార్​, ఝార్ఖండ్​, ఒడిశా, పశ్చిమ బెంగాల్​, తూర్పు ఉత్తర్​ ప్రదేశ్​, ఆంధ్రప్రదేశ్​ తీర ప్రాంతం, ఉత్తర ఛత్తీస్​గఢ్​లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్య ప్రదేశ్​, తెలంగాణ, గుజరాత్​ తీర ప్రాంతాల్లో హీట్​వేవ్​ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

ఇదీ చదవండి :- Ayurvedic Remedies : ఎండతో చర్మం ఎర్రగా, దురదగా మారితే.. ఇలా చేయండి

"మే నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటాయి. ఈసారి మాత్రం వాయువ్య, పశ్చిమ- మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉండొచ్చు. ఈ ప్రాంతాల్లో హీట్​వేవ్​ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు," అని ఐఎండీ డైరక్టర్​ ఎం మోహపాత్ర తెలిపారు.

హీట్​ ఇండెక్స్​..

Heatwave in India 2023 : 'హీట్​ ఇండెక్స్​'ను తొలిసారిగా లాంచ్​ చేసింది భారత వాతావరణశాఖ. తేమ, ఉష్ణోగ్రతల కారణంగా మానవ శరీరంలో ఎలా ఫీల్​ అవుతోంది అన్నది ఈ హీట్​ ఇండెక్స్​ చెబుతుంది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా.. ఈ 'ఫీల్స్​ లైక్​' డేటాను ఐఎండీ ప్రతి రోజు విడుదల చేయాలని ప్లాన్​ చేస్తోంది. ఫలితంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండటానికి వీలవుతుందని అభిప్రాయపడుతోంది.ఈ విషయాన్ని ఎర్త్​ సైన్సెస్​ మినిస్ట్రీ సెక్రటరీ ఎం రవిచంద్రన్​ తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం