Missing Bengaluru boy: తప్పిపోయిన బెంగళూరు బాలుడు హైదరాబాద్‌లో ప్రత్యక్షం
తప్పిపోయిన బెంగళూరు బాలుడు హైదరాబాద్‌లో దొరికాడు. సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోలు అతడిని గుర్తించడంలో సహాయపడ్డాయి.
బెంగళూరు, జనవరి 24: బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లోని కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి చేరుకోని 12 ఏళ్ల పరిణవ్ జనవరి 21 నుంచి కనిపించకుండా పోయాడు. సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేసేలోపే ఒక చోటి నుంచి మరోచోటికి వెళ్లిపోయాడు. అప్పుడే సోషల్ మీడియా రంగంలోకి దిగింది. బాలుడి పోస్టర్లను ఆన్ లైన్ లో సర్క్యులేట్ చేశారు.
ఈ రోజు ఉదయం హైదరాబాద్ వచ్చిన బెంగళూరు వాసి తన ఫోన్ లో ఉన్న చిత్రాలను పోలిన ఈ బాలుడిని అదే మెట్రోలో చూసి పట్టుకున్నారు. ఈనేపథ్యంలో హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్‌లో పోలీసులు ఈ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
"అతను అక్కడికి ఎలా వచ్చాడనే కచ్చితమైన వివరాలు మాకు తెలియవు. అతడిని తీసుకెళ్లేందుకు హైదరాబాద్ వెళ్తున్నాం. పూర్తి వివరాలు తెలిశాక అప్ డేట్ చేస్తాం. కానీ మా అబ్బాయిని కనుగొనడంలో మాకు సహాయం చేసిన పేరులేని అపరిచితులందరికీ నేను నిజంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను..’’ అని వైట్ ఫీల్డ్ లో నివసించే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన పరిణవ్ తండ్రి సుఖేష్ చెప్పారు.
ఇంతకుముందు ఇంటికి తిరిగి రావాలని కోరుతూ ఒక వీడియోను పోస్ట్ చేసిన పరిణవ్ తల్లి, ఇప్పుడు మరో వీడియోను పోస్ట్ చేసింది. ఇది కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. తన కుమారుడిని కనుగొనడంలో తమకు సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.