Myanmar Girl | ఓ బాలిక.. రెండు దేశాల మధ్య చర్చలు.. ఇదో కన్నీటి కథ.. భారత్ ఎలా వచ్చిందో ఆమెకే తెలియదు-mha to attempt deporting rohingya girl back to myanmar again 15 yr old doesnt want to return ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Myanmar Girl | ఓ బాలిక.. రెండు దేశాల మధ్య చర్చలు.. ఇదో కన్నీటి కథ.. భారత్ ఎలా వచ్చిందో ఆమెకే తెలియదు

Myanmar Girl | ఓ బాలిక.. రెండు దేశాల మధ్య చర్చలు.. ఇదో కన్నీటి కథ.. భారత్ ఎలా వచ్చిందో ఆమెకే తెలియదు

Madasu Sai HT Telugu
Feb 02, 2022 07:49 PM IST

అస్సాంలోని సిల్చార్‌లో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను కొన్నేళ్ల కిందట పోలీసులు రక్షించారు. వేరే దేశానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ విషయాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలిపారు. ఇప్పుడు ఆమెను స్వదేశం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ బాలిక? భారత్ ఎలా వచ్చింది?

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం (Unplash)

2019లో అస్సాంలోని సిల్చార్ పట్టణానికి సమీపంలో రోంగ్ పూర్ ప్రాంతంలో ఓ బాలిక అపస్మారక స్థితిలో పోలీసులకు కనిపించింది. అప్పుడు ఆమెకు 13 ఏళ్లు. అక్కడకు ఆమె ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఎందుకు వచ్చిందో కూడా ఎవరికీ అర్థం కాలేదు. మయన్మార్ కు చెందిన రోహింగ్యా బాలికగా మాత్రం అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అధికారులు తెలియజేశారు. ఆమెను రక్షించిన పోలీసులు.. ఆమెను కౌన్సెలింగ్ కోసం ఉజ్జల షెల్టర్ హోమ్ ఫర్ గర్ల్స్ అండ్ వుమెన్‌కు అప్పగించారు. ఆమె దాదాపు ఒక సంవత్సరం పాటు అక్కడే ఉండి, నివేధిత నారీ సంస్థకు వెళ్లింది. అయితే ఈ కేసుపై అధికారులకు మెుదటి నుంచి అనుమానంగానే ఉంది. మానవ అక్రమ రవాణాలో భాగంగా బాలిక ఇక్కడకు వచ్చిందని.. అర్థమైంది. కానీ ఎలా వచ్చిందనే దానిపై మాత్రం స్పష్టత లేదు.

ఆ తర్వాత నుంచి.. ఆమె జీవితం మెుదలైంది. మెల్లగా ఇండియాలో ఉండటం అలవాడు పడింది. స్థానిక భాషతోపాటు ఇంగ్లీష్ నేర్చుకుంది. తనతోపాటు.. నారీ సంస్థలో ఉండే మిగతా అమ్మాయిలతో కలిసిపోయింది. ఈ సమయంలోనే కేంద్ర హోం వ్యవహారాల శాఖ.. ఆమెను తన స్వదేశం పంపాలని నిర్ణయించింది. ఆ అమ్మాయితో మాట్లాడింది. అయితే ఆ సమయంలో మంత్రిత్వ శాఖ నిర్ణయం కొన్ని రోజులు వాయిదా వేసుకుంది.

గత ఏడాది ఏప్రిల్‌లో, కాచర్ జిల్లాకు పోలీసుల బృందం మయన్మార్ బాలికతో కలిసి మణిపూర్‌లోని మోరేలో ఉన్న ఇండో-మయన్మార్ సరిహద్దుకు ఆమెను అప్పగించాలని భావించింది. కానీ అంతర్జాతీయ సరిహద్దు గేటు తెరవడానికి ఇమ్మిగ్రేషన్ విభాగం నిరాకరించింది. తాజాగా మళ్లీ.. ఈ ఏడాది ఏప్రిల్ లో మయన్మార్ కు పంపాలని నిర్ణయించుకుంది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి తన స్వదేశానికి వెళ్లడానికి ఇష్టంగా లేదు.

పత్రికల్లో వచ్చిన సమాచారం ఆధారంగా.. బాలిక తండ్రికి ఈ విషయం తెలిసింది. కొన్ని రోజులకు నారీ సంస్థకు లేఖలు రాయడం మెుదలు పెట్టారు. ఇప్పుడు ఆయన బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లోని రోహింగ్యా శరణార్థి శిబిరంలో ఉన్నారని నారీ సంస్థ అధికారులు చెబుతున్నారు.

నారీ సంస్థ వ్యవస్థాపక సీక్రెసీ దిబా రాయ్ మాట్లాడుతూ.. బాలిక తండ్రి నాకు లేఖలు రాశారు. ఆమెను మయన్మార్‌కు పంపించడం బాలిక తండ్రికి ఇష్టం లేదు. ఆమె గురించి వార్తాపత్రికలలో చదివి, మా చిరునామాకు లేఖలు పంపారు. అప్పటి నుంచి ఈ అమ్మాయికి జీవించాలనే కొత్త ఆశ కలిగింది. ఆమె మామయ్య హైదరాబాద్‌ లో ఉంటారని.., అక్కడకు పంపమని ఆమె తండ్రి ఒక లేఖలో అభ్యర్థించారు. కానీ మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. ఈ విషయం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చూసుకుంటోంది.

కిందటి ఏడాది ఆమెను మయన్మార్ పంపాలని.. మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేసిందని రాయ్ చెప్పారు. రెండు దేశాల మధ్య చాలా చర్చల తర్వాత, ఆమె మళ్లీ తమ వద్దకే తిరిగి వచ్చిందని రాయ్ వెల్లడించారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఆమెను తిరిగి పంపాలని ఆదేశించిందని  చెబుతున్నారు. కానీ ప్రస్తుతం మయన్మార్‌లో పరిస్థితి బాగా లేదని.., అమ్మాయికి ఎలాంటి చేడు జరగకూడదని కోరుకుంటున్నట్టు తెలిపారు. పోలీసులను అడిగితే.. కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆదేశాలు.. ఆ అమ్మాయిని పంపించాలని చెబుతున్నాయన్నారు.

ఇంతకీ భారత్ ఎలా వచ్చింది?

తనకు 13 ఏళ్ల వయసులో మలేషియా వ్యక్తిని టెలిఫోన్ ద్వారా (ఇస్లామిక్ ప్రకారం) వివాహం చేసుకున్నట్లు బాలికే వెల్లడించింది. తన తల్లిదండ్రులతో కలిసి బంగ్లాదేశ్ వెళ్లిపోయానని చెప్పింది. ఆ తర్వాత అతడిని కలిశాక.. స్పృహ కోల్పోయానని..  ఏం జరిగిందో తెలియదని బాలిక చెబుతోంది. కానీ మేల్కొన్నప్పుడు తాను భారతదేశంలోనే ఉన్నానని వెల్లడించింది.

అయితే బాలిక నారీ సంస్థ అధికారులతో చాలా విషయాలు వెల్లడించింది. ఆమె చెప్పిన ఆధారాలను బట్టి.. కిడ్నాప్ చేసిన వ్యక్తి కాచర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాలిక అతనిని గుర్తించిన తర్వాత.. చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు నారీ సంస్థ అధికారులు. పోలీసులు ఫిర్యాదు చేయమని కోరాగా.. బాలిక భద్రత ముఖ్యం కాబట్టి.. వెనక్కు తగ్గారు. మరోవైపు నారీ సంస్థ రూల్స్ ప్రకారం.. ఆమె 18 ఏళ్లు నిండిన తర్వాత ఆశ్రయం ఇవ్వదు. ఏప్రిల్ లో కేంద్రం హోం వ్యవహారాల శాఖ ఏం చేస్తుందో ఇక వేచి చూడాలి.

Whats_app_banner