Crime news : సహజీవనంలో ఉన్న వ్యక్తిని దారుణంగా చంపిన మహిళ!
Crime news : ఓ గదిలో రక్తపుమడుగులో పడి ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సహజీవనంలో ఉన్న మహిళే, అతడిని చంపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
Crime news : రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సహజీవనంలో ఉన్న మహిళే.. అతడిని చంపిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ జరిగింది..
మధ్యప్రదేశ్‌కు చెందిన 32ఏళ్ల తన్వర్‌కు ముందే పెళ్లి జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. కొంత కాలం క్రితం అతను ఓ మహిళకు కలిశాడు. అమెకు అప్పటికే పెళ్లి అయ్యింది. ఆమెకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య పరిచయం పెరిగింది. బంధం బలపడింది. ఇద్దరు కలిసి సహజీవనంలో ఉండాలని నిర్ణయించుకున్నటటు సమాచారం.
Woman kills live in partner : ఈ నేపథ్యంలో కోటాలోని గణేశ్ కాలనీలో రోజువారీ కూలీలుగా పనిచేస్తూ.. వీరిద్దరు ఓ గదిని రెంట్‌కు తీసుకుని సహజీవనంలో ఉండటం మొదలుపెట్టారు.
కాగా.. ఇంటి యజమాని, బుధవారం సాయంత్రం.. తన్వర్ గదికి వెళ్లాడు. ఎంత సేపు డోర్ కొట్టినా, ఎవరు స్పందిచకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చింది. డోర్‌ని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లగా.. రక్తపుమడుగులో పడి ఉన్న తన్వర్ మృతదేహాన్ని చూసి, ఆయన షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఘటన జరిగి గదిలో ఓ పెద్ద బండ రాయిని గుర్తించారు. ఆ రాయితోనే ఎవరో.. అతడి తల మీద బలంగా కొట్టి, కొట్టి చంపేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో.. తన్వర్, ఓ మహిళతో లివ్-ఇన్ రిలేషన్లో ఉన్నాడని తెలుసుకున్నారు. ఇంటిని వెతకగా.. ఆమె పోలీసులకు కనిపించలేదు.
Rajasthan crime news : మరోవైపు.. తన్వర్ మరణ వార్తను అతని తండ్రికి చెప్పారు పోలీసులు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం.. అతని తండ్రికి అప్పగించారు.
కాగా.. తన కుమారుడి మరణానికి అతని లివ్-ఇన్ పార్టనర్ కారణమని ఆరోపించారు తన్వర్ తండ్రి. 'నా కుమారుడిని హత్య చేసి, ఆమె పారిపోయింది,' అని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Kota crime today news latest : ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంబంధిత మహిళను ఇంకా పట్టుకోలేదు. ఆమె కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టినట్టు, త్వరలోనే ఆ మహిళను పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు. అసలు తన్వర్ ఎలా చనిపోయాడు? ఎవరు చంపారు? అన్న విషయాలపై స్పష్టత రావాలంటే.. పోలీసులు ఆ మిస్టరీ మహిళను పట్టుకుని విచారించాల్సిందే!
సంబంధిత కథనం