Man kills live- in partner : సహజీవనం చేస్తున్న మహిళను ప్రెజర్​ కుక్కర్​తో కొట్టి చంపిన ప్రియుడు!-karnataka man arrested for killing live in partner with pressure cooker ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Karnataka: Man Arrested For Killing Live-in Partner With Pressure Cooker

Man kills live- in partner : సహజీవనం చేస్తున్న మహిళను ప్రెజర్​ కుక్కర్​తో కొట్టి చంపిన ప్రియుడు!

Sharath Chitturi HT Telugu
Aug 28, 2023 04:25 PM IST

Man kills live- in partner : సహజీవనంలో ఉన్న ప్రియురాలని ప్రెజర్​ కుక్కర్​తో కొట్టి చంపేశాడు ఓ వ్యక్తి. బెంగళూరులో ఈ దారుణ ఘటన జరిగింది.

లివ్​-ఇన్​ రిలేషన్​లో ఉన్న మహిళను ప్రెజర్​ కుక్కర్​తో కొట్టి చంపిన వ్యక్తి!
లివ్​-ఇన్​ రిలేషన్​లో ఉన్న మహిళను ప్రెజర్​ కుక్కర్​తో కొట్టి చంపిన వ్యక్తి!

Man kills live- in partner : కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాను సహజీవనం చేస్తున్న మహిళను ప్రెజర్​ కుక్కర్​తో కొట్టి చంపేశాడు ఓ వ్యక్తి!

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

కేరళ తిరువనంతపురంకు చెందిన 24ఏళ్ల దేవా, కొల్లంవాసి వైష్ణవ్​లు కాలేజ్​ డేస్​ నుంచి కలిసి చదువుకున్నారు. కాగా.. బెంగళూరులో వీరిద్దరికి సేల్స్​, మార్కెటింగ్​లో ఉద్యోగం వచ్చింది. దాదాపు రెండేళ్లుగా వీరిద్దరు దక్షిణ బెంగళూరు బెగుర్​లోని ఓ ఇంట్లో లివ్​-ఇన్​లో ఉంటున్నారు.

అయితే వీరి బంధం బలహీనంగా ఉండేదని తెలుస్తోంది. వీరిద్దరు తరచూ గొడవపడుతూ ఉండేవారు. ఆ అరుపులు పక్కన ఇంట్లో వారికి కూడా వినపడేది. అదే సమయంలో వైష్ణవ్​కు దేవాపై అనుమానం మొదలైంది. మహిళ, తనను చీట్​ చేస్తోందని అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం.. ఈ విషయంపై వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. అప్పుడే.. కోపంతో ఊగిపోయిన వైష్ణవ్​.. మహిళ తలపై ప్రెజర్​ కుక్కర్​తో కొట్టి, కొట్టి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

Karnataka crime news : దేవాను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో ఘటనపై కేసు నమోదు చేసుకుని.. నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

కొన్ని గంటల్లోనే.. నిందితుడు వైష్ణవ్​ పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు.

లివ్​-ఇన్​లో గొడవలు..!

Bengaluru crime news : దేశంలో లివ్​-ఇన్​ రిలేషన్​ చుట్టూ ఈ మధ్య కాలంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా.. గతేడాది చివర్లో దిల్లీలో వెలుగులోకి వచ్చిన అఫ్తాబ్​ పూనావాలా- శ్రద్ధా వాల్కర్​ల కేసును ప్రజలు అస్సలు మర్చిపోలేరు. వీరు కూడా తరచూ గొడవపడుతూ ఉండేవారు. చివరికి.. శ్రద్ధను చంపేసిన అఫ్తాబ్​.. ఆమె శరీరాన్ని ముక్కలు, ముక్కలుగా నరికి.. వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అప్పటి నుంచి ఈ తరహా ఘటనకు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి.

సంబంధిత కథనం

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.