Maharashtra political crisis: మధ్యాహ్నం 1 గంటలకు కేబినెట్ మీటింగ్
ముంబై, జూన్ 22: మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.
మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలు బీజేపీ చేరవచ్చని ఊహాగానాలు చెలరేగడంతో ఈ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు.
సూరత్‌లోని లీ మెరిడియన్ హోటల్‌లో బస చేసిన ఏక్‌నాథ్ షిండే 33 మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో బుధవారం ఉదయం అస్సాంలోని గౌహతి చేరుకున్నారు.
40 మంది పార్టీ ఎమ్మెల్యేలు అసోం చేరుకున్నారని, వారు బాలాసాహెబ్ థాకరే హిందుత్వాన్ని కాపాడతారాని షిండే బుధవారం పేర్కొన్నారు.
మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన నేపథ్యంలో షిండే ఇతర ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక హోటల్‌లో బస చేసి, ఈరోజు తెల్లవారుజామున గౌహతి చేరుకున్నారు.
‘మొత్తం 40 మంది శివసేన ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. మేం బాలాసాహెబ్ ఠాక్రే హిందుత్వాన్ని మోస్తాం..’ అని గౌహతి చేరుకున్న తర్వాత షిండే అన్నారు.
మహారాష్ట్ర ఎమ్మెల్యేల బృందం ఈరోజు ఉదయం అస్సాంలోని గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకుంది. 40 మంది శివసేన ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని గౌహతి చేరుకున్న షిండే చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అనుమానం వెల్లువెత్తిన కొద్ది గంటల్లోనే షిండే, మరికొందరు ఎమ్మెల్యేలు అందుబాటులోకి రాలేదు.
మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలలో అనుమానిత క్రాస్ ఓటింగ్ తర్వాత ఈ ఘట్టం ప్రారంభమైంది. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఐదు స్థానాలను గెలుచుకుంది. ఇది మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి ప్రభుత్వానికి పెద్ద దెబ్బ. సోమవారం పోలింగ్ జరిగిన శాసన మండలిలోని మొత్తం 10 సీట్లలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), శివసేన చెరో రెండు గెలుపొందగా, కాంగ్రెస్ ఒక్క సీటును కైవసం చేసుకోగలిగింది.
ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం షిండేతోపాటు మరికొందరు శివసేన ఎమ్మెల్యేలు సూరత్‌లోని లీ మెరిడియన్ హోటల్‌లో బస చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితులు మిలింద్ నార్వేకర్, రవీంద్ర ఫాటక్‌లతో కూడిన శివసేన ప్రతినిధి బృందం కూడా సూరత్‌లో షిండే, ఇతర శాసనసభ్యులతో సమావేశమైంది.
ఎంవీఏ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం వ్యాఖ్యానించారు. కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు, ఏక్నాథ్ షిండే ప్రస్తుతం అందుబాటులో లేదరని ధృవీకరించారు. శివసేన ఎమ్మెల్యేలు సూరత్‌లో ఉన్నారని, వారిని బయటకు వెళ్లనివ్వడం లేదని ఆయన అన్నారు.
టాపిక్