ఔరంగాబాద్ పేరు మార్చిన ఉద్దవ్ సర్కార్.. శంభాజీనగర్‌గా నామకరణం-maharashtra cabinet approves renaming of aurangabad city as sambhajinagar and that of osmanabad city as dharashiv ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఔరంగాబాద్ పేరు మార్చిన ఉద్దవ్ సర్కార్.. శంభాజీనగర్‌గా నామకరణం

ఔరంగాబాద్ పేరు మార్చిన ఉద్దవ్ సర్కార్.. శంభాజీనగర్‌గా నామకరణం

HT Telugu Desk HT Telugu
Jun 29, 2022 06:58 PM IST

సంక్షోభంలో పడిన ఉద్దవ్ సర్కార్ కేబినెట్ ఈ సాయంత్రం సమావేశమైంది. ఔరంగాబాద్, ఒస్మానాబాద్ నగరాల పేరు మార్చేసింది.

<p>ఉద్దవ్ థాకరే</p>
ఉద్దవ్ థాకరే (HT_PRINT)

మహారాష్ట్ర మంత్రి మండలి ఔరంగాబాద్ సిటీ పేరు మార్చేసింది. శంభాజీనగర్‌గా పేరు పెట్టింది. అలాగే ఒస్మానాబాద్ సిటీకి ధారాశివ్‌గా నామకరణం చేసింది.

రేపు విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి ఉండగా ఆకస్మికంగా సమావేశమైన ఉద్దవ్ థాకరే మంత్రిమండలి ఈ సంచలన నిర్ణయాలు తీసుకుంది.

మరోవైపు విశ్వాస పరీక్షకు నిలబడాలంటూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసనే చీఫ్ విప్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ సాయంత్రం 5 గంటల నుంచి విచారణ జరుపుతోంది.

విచారణలో సునీల్ ప్రభు తరపున అభిషేక్ మను సింఘ్వీ, రెబల్ ఎమ్మెల్యేల తరపున నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపిస్తున్నారు.

Whats_app_banner

టాపిక్