Khosta-2 virus : గబ్బిలాల నుంచి మనుషుల్లోకి మరో ప్రాణాంతక వైరస్​..!-khosta2 all about russian bat virus that could infect humans ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Khosta-2 Virus : గబ్బిలాల నుంచి మనుషుల్లోకి మరో ప్రాణాంతక వైరస్​..!

Khosta-2 virus : గబ్బిలాల నుంచి మనుషుల్లోకి మరో ప్రాణాంతక వైరస్​..!

Sharath Chitturi HT Telugu
Sep 24, 2022 07:40 AM IST

Khosta-2 virus : ఖోస్తా 2 అనే వైరస్​.. జంతువుల నుంచి మనుషుల్లోకి వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది కూడా తొలుత గబ్బిలాల్లోనే గుర్తించినట్టు వెల్లడించారు.

<p>గబ్బిలాల నుంచి మనుషులకు మరో ప్రాణాంతక వైరస్​​..!</p>
గబ్బిలాల నుంచి మనుషులకు మరో ప్రాణాంతక వైరస్​​..! (nature.org/google)

Khosta-2 virus news : కరోనా వైరస్​తో ఉక్కిరిబిక్కిరి అయిన మానవాళికి మరో బ్యాడ్​ న్యూస్​! మరో కొత్త రకం వైరస్​ను అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఖోస్తా 2గా పిలుస్తున్న ఈ వైరస్​.. మనుషుల్లో వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది మనిషి కణాల్లోకి ప్రవేశించడంతో పాటు ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు దీనిపై ప్రభావం చూపించడం లేదని స్పష్టం చేశారు.

కరోనా వైరస్​.. 2019 చివర్లో తొలుత చైనాలో వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్​కు బలయ్యారు. దీని పుట్టుకపై ఉన్న ప్రశ్నలకు ఇంకా ఎలాంటి సమాధానాలు లేవు. అయితే.. ఇది గబ్బిలాల నుంచి మనుషులకు సోకి ఉంటుందని పలు అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించిన ఖోస్తా 2 వైరస్​ని కూడా.. 2020లో తొలిసారిగా రష్యాలోని గబ్బిలాల్లోనే కనిపించడం గమనార్హం.

Khosta 2 virus in bats : 2020లోనే ఈ ఖోస్తా 2పై పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు.. ఇది మనుషులపై ప్రభావం చూపించదు అని భావించారు. తాజాగా మరోమారు జరిగిన పరిశోధనల్లో మాత్రం.. ఈ వైరస్​ మనుషులకు సోకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్​కి టీకా వేసుకున్న వారిపైనా ఇది ప్రభావం చూపిస్తుండటం ఆందోళనకర విషయం. ఇందుకు సంబంధించిన రీసెర్చ్​.. జర్నల్​ పీఎల్​ఓఎస్​ పాథోజెన్స్​లో పబ్లీష్​ అయ్యింది.

ఖోస్తా 2 వైరస్​ అంటే ఏంటి?

ఈ సార్స్​ కోవ్​2, ఖోస్తా 2 వైరస్​లు.. సర్బెకొవైరస్​ జాతికి చెందినవి. టైమ్స్​ మ్యాగజైన్​ నివేదిక ప్రకారం.. ఖోస్తా 1.. మనుషులపై ప్రభావం చూపించదు. కానీ ఖోస్తా 2.. మనుషులకు ముప్పుగా మారే అవకాశం ఉంది. మనిషి కణాల్లోకి కొవిడ్​ ఏ విధంగా ప్రవేశించిందో.. ఈ ఖోస్తా 2 వైరస్​ కూడా అదే విధంగా వెళుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Khosta 2 virus news : అయితే ఇక్కడ ఒక ఊరటనిచ్చే విషయాన్ని చెప్పారు శాస్త్రవేత్తలు. ఒమిక్రాన్​లాగా.. తీవ్రమైన ఆనారోగ్య సమస్యలను సృష్టించే జీన్స్​ ఈ ఖోస్తా 2కు ప్రస్తుతం లేదని వెల్లడించారు. అయితే.. సార్స్​ కొవ్​ 2 జీన్స్​తో ఇది కలిస్తే.. ప్రమాదం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఖోస్తా 2 వ్యాప్తి ఎలా ఉంటుంది?

ఈ ఖోస్తా 2 ప్రస్తుతం జంతువుల్లోనే వ్యాపిస్తోంది. ఇది మరో మహమ్మారిగా మారుతుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు.

"సార్స్​ కొవ్​ 2, ఖోస్తా 2లు కలిసే అవకాశం చాలా తక్కువగా ఉంది. కానీ జంతువుల్లో ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇలాంటి వైరస్​ల నుంచే కాకుండా ఇతర సర్బెకొవైరస్​ల నుంచి రక్షణ పొందే విధంగా టీకాల తయారీకి కృషి జరుగుతోంది. ఇప్పుడున్న టీకాలు.. కేవలం ఒక్క వైరస్​ కోసమే రూపొందించారు. అందువల్ల వేరే వైరస్​లపై అవి పనిచేయం లేదు. అన్ని రకాల వైరస్​ల నుంచి రక్షణ పొందే విధంగా టీకాలను అభివృద్ధి చేయడం ఇప్పుడు అత్యావశ్యకం," అని పరిశోధనలో పాల్గొన్న ఓ శాస్త్రవేత్త వెల్లడించారు.

Whats_app_banner

సంబంధిత కథనం