Karnataka govt's order : : ఓలా, ఉబర్ లకు కర్నాటక ప్రభుత్వం షాక్
Karnataka govt's order : మూడు రోజుల్లోగా బెంగళూరు సహా కర్నాటకలో ఆటో రిక్షా సర్వీసులను నిలిపేయాలని కర్నాటక ప్రభుత్వం ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర టాక్సీ అగ్రిగేటర్ సంస్థలను ఆదేశించింది.
Karnataka govt's order : అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణీకుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో, టాక్సీ అగ్రిగేటర్ సంస్థలైన ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర టాక్సీ అగ్రిగేటర్ సంస్థలపై చర్యలకు కర్నాటక ప్రభుత్వం ఉపక్రమించింది.
Karnataka govt's order : నిలిపేయండి..
ప్రభుత్వం నిర్దేశించిన చార్జీల కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారని ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర టాక్సీ అగ్రిగేటర్ సంస్థల ఆటో రిక్షా సర్వీసులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దాంతో, ప్రభుత్వం వెంటనే స్పందించింది. మూడు రోజుల్లోగా బెంగళూరు సహా కర్నాటకలో ఒలా, ఉబర్, ర్యాపిడో తదితర టాక్సీ అగ్రిగేటర్ సంస్థల ఆటో రిక్షా సర్వీసులను నిలిపేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఈ విషయంలో తమ వాదనలను నాలుగు రోజుల్లోగా రాష్ట్ర రవాణా విభాగానికి తెలియజేయాలని ఆయా సంస్థలను ఆదేశించింది. ప్రభుత్వం నిర్దేశించిన చార్జీల కన్నా చాలా ఎక్కువగా ఈ సంస్థలు ప్రయాణీకుల నుంచి వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. అలాగే, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ సర్వీసులు నడుస్తున్నట్లు తేలిందని పేర్కొంది.