JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ఇదే..-jee advanced 2024 exam date released registration begins on april 21 at jeeadv ac in ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ఇదే..

JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ఇదే..

HT Telugu Desk HT Telugu
Nov 24, 2023 06:23 PM IST

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష తేదీ వెల్లడైంది. ఏప్రిల్ 21న jeeadv.ac.inలో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల తేదీ వెల్లడి
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల తేదీ వెల్లడి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 షెడ్యూల్‌ను విడుదల చేసింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ 2024 మే 26, 2023న దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 21న ప్రారంభమై ఏప్రిల్ 30, 2024 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. అభ్యర్థులు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 6, 2024. అడ్మిట్ కార్డ్ మే 17న విడుదలవుతంది. మే 26, 2024 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష మే 26న రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. పేపర్ I ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.

అభ్యర్థుల ప్రతిస్పందనల కాపీ మే 31, 2024న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. తాత్కాలిక ఆన్సర్ కీ జూన్ 2, 2024న ప్రదర్శిస్తారు. అభ్యంతరాల విండో జూన్ 3, 2024న మూసివేస్తారు. ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు జూన్‌ 9, 2024న ప్రకటిస్తారు.

ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) 2024 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 9న ప్రారంభమై జూన్ 10, 2024న ముగుస్తుంది. AAT పరీక్ష జూన్ 12న ఒకే షిఫ్ట్‌లో- ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఫలితాలు జూన్ 15, 2024న ప్రకటిస్తారు.

ఉమ్మడి సీట్ల కేటాయింపు (JoSAA) 2024 ప్రక్రియ జూన్ 10, 2024న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్‌ని తనిఖీ చేయవచ్చు.

IPL_Entry_Point

టాపిక్