యుద్ధ నౌక నుంచి మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన నేవీ-indian navy successfully tests surface to air missile system from warship ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  యుద్ధ నౌక నుంచి మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన నేవీ

యుద్ధ నౌక నుంచి మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన నేవీ

HT Telugu Desk HT Telugu
May 26, 2022 11:30 AM IST

భారత నావికా దళం యుద్ధ నౌక నుంచి తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించింది.

<p>భారత నావికా దళం ప్రయోగించిన మిస్సైల్</p>
భారత నావికా దళం ప్రయోగించిన మిస్సైల్ (IndianNavy)

న్యూఢిల్లీ: తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాన్ని ఛేధించడం ద్వారా భారత నావికా దళం వార్‌షిప్ ఆధారిత ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మిస్సైల్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది.

ఈ పరీక్షకు సంబంధించిన వీడియోను కూడా భారత నావికా దళం ట్విటర్‌లో షేర్ చేసింది.

‘మీ నావికా దళ మార్గదర్శనంలోని మిస్సైల్ యాంటీ-సబ్ మెరైన్ రహస్య యుద్ధ నౌక ఎంత అద్భుతంగా పనిచేస్తోందో చూడండి. తక్కువ ఎత్తు లక్ష్యాన్ని తన ఎస్ఏఎం సిస్టమ్ ద్వారా, వార్ షిప్ క్రూ విజయ మంత్రం హిట్ ఫస్ట్.. హిట్ హార్డ్ మంత్రాన్ని పటిస్తూ, ఎలా విజయవంతంగా చేధించిందో చూడండి.. వారికి అభినందనలు..’ అని ఇండియన్ నేవీ పేర్కొంది.

ఈ పరీక్షను పశ్చిమ సముద్ర తీరంలో మోహరించిన రహస్య యుద్ధ నౌక మీద జరిపారు.

కాగా సముద్రాల్లో శత్రు నౌకలను ధ్వంసం చేసేందుకు వీలుగా దేశీయ సాంకేతిక నైపుణ్యంతో భారత నౌకాదళం కోసం రక్షణ శాఖ నౌకా విధ్వంసక క్షిపణిని ఇటీవలే విజయవంతంగా ప్రయోగించింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భారత నౌకాదళం సంయుక్తంగా నౌకా విధ్వంసక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించాయి. ఆ క్షిపణిని ఒడిశాలో తీరంలోని ఛాందీపూర్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో నావిక దళ హెలికాప్టర్ నుంచి ప్రయోగించాయి. అది మొట్టమొదటి వైమానిక ప్రయోగం ద్వారా ప్రయోగించిన విధ్వంసక క్షిపణి వ్యవస్థ కావడం విశేషం.

Whats_app_banner