monkeypox | `మంకీపాక్స్` వ్యాక్సిన్ దిశగా తొలి అడుగు
monkeypox | ప్రపంచ దేశాలను వణికిస్తున్న `మంకీపాక్స్ వైరస్` కు వ్యాక్సిన్‌ను రూపొందించే దిశగా భారత్ తొలి అడుగు వేసింది. కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా భారత్ ప్రపంచదేశాలకు దిక్సూచిగా నిలిచిన విషయం తెలిసిందే.
monkeypox | పుణెలోని `నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIV)` లో శాస్త్రవేత్తలు మంకీపాక్స్ వైరస్‌ను విజయవంతంగా వేరు చేశారు. మంకీ పాక్స్ సోకిన వ్యక్తి చర్మంపై ఉన్న పొక్కుల స్రావాల నుంచి తీసిన సాంపిల్‌లో నుంచి ఈ వైరస్‌ను విజయవంతంగా వేరు చేశారు. వ్యాక్సిన్ తయారీలో వైరస్‌ను వేరు చేయడం అనేది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. కరోనా వైరస్‌ను కూడా భారత్‌లోని `నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIV)`లోనే వేరు చేశారు. ఆ తరువాత భారత్ బయోటెక్ వారు వ్యాక్సిన్ తయారీ ప్రక్రియను ప్రారంభించారు.
monkeypox | డబుల్ స్ట్రాండెడ్ డీఎన్ఏ వైరస్(double-stranded DNA virus)
మంకీ పాక్స్ వైరస్ ఒక డబుల్ స్ట్రాండెడ్ డీఎన్ఏ(double-stranded DNA virus) వైరస్. ఇందులో సెంట్రల్ ఆఫ్రికన్ జన్యుమూలం, వెస్ట్ ఆఫ్రికన్ జన్యుమూలం ఉంటాయి. ఈ వైరస్ ను వేరుచేయడం వల్ల వ్యాక్సిన్‌ను తయారు చేసే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. దీంతో, వ్యాక్సిన్ రూపొందించడంతో పాటు సులువైన టెస్టింగ్ కిట్స్‌ను కూడా రూపొందించేందుకు కూడా వీలవుతుంది. డయాగ్నస్టిక్ కిట్స్‌ను, వ్యాక్సిన్‌ను రూపొందించడానికి ఈ వైరస్‌ను వేరుచేయడం అత్యంత కీలకమని పుణెలోని NIVలో పని చేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త ప్రజ్ఞ యాదవ్ తెలిపారు.
monkeypox | చికెన్‌పాక్స్ టీకానే..
ప్రస్తుతం మంకీపాక్స్‌కు కూడా చికెన్‌పాక్స్‌కు వాడే వ్యాక్సిన్‌నే వాడుతున్నారు. ఈ టీకాను ఉత్పత్తి చేయడానికి డెన్మార్క్‌కు చెందిన ఒక కంపెనీకి మాత్రమే లైసెన్స్ ఉంది. ఈ వ్యాక్సిన్‌ను విరియోలా వైరస్ ఆధారంగా తయారు చేశారు. చికెన్ పాక్స్‌కు, మంకీపాక్స్‌కు కారణమైన రెండు వైరస్‌లు కూడా ఈ విరియోలా (variola) ఫ్యామిలీకి చెందినవే. ప్రస్తుతం ఈ విరియోలా ఫ్యామిలీకి చెందిన లైవ్ వైరస్‌ను అమెరికా, రష్యాల్లోని రెండు ల్యాబ్‌ల్లో మాత్రమే స్టోర్ చేశారు.