Dalai Lama comments on Tibet | టిబెట్ పోరాటంపై ద‌లైలామా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు-india china have to solve border issue through talks dalai lama ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dalai Lama Comments On Tibet | టిబెట్ పోరాటంపై ద‌లైలామా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Dalai Lama comments on Tibet | టిబెట్ పోరాటంపై ద‌లైలామా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

HT Telugu Desk HT Telugu
Jul 15, 2022 04:43 PM IST

Dalai Lama comments on Tibet : టిబెట్‌కు తాము స్వాతంత్య్రాన్ని కోరుకోవ‌డం లేద‌ని ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు ద‌లైలామా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టిబెట్ ప్ర‌జ‌లు కోరుకుంటోంది స్వ‌యం ప్ర‌తిప‌త్తి మాత్ర‌మేన‌న్నారు. ఈ విష‌యాన్ని చైనా ప్ర‌జ‌లు కూడా అర్థం చేసుకుంటున్నార‌న్నారు.

బౌద్ధ ఆధ్యాత్మిక గురువు ద‌లైలామా
బౌద్ధ ఆధ్యాత్మిక గురువు ద‌లైలామా (HT_PRINT)

Dalai Lama comments on Tibet : వివాదాల ప‌రిష్కారానికి మిల‌ట‌రీ ఫోర్స్‌ను ఉప‌యోగించే విధానానికి కాలం చెల్లింద‌ని వ్యాఖ్యానించారు. తూర్పు ల‌ద్దాఖ్‌లో స‌రిహ‌ద్దుల్లో భార‌త్‌, చైనాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ద‌లైలామా ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

Dalai Lama comments on Tibet: టిబెట్‌పై..

చైనా, టిబెట్‌ల మ‌ధ్య ద‌శాబ్దాలుగా కొనసాగుతున్న వివాదంపై ఆధ్యాత్మిక గురువు ద‌లైలామా స్పందించారు. టిబెట్‌కు స్వాతంత్య్రాన్ని తాను కోరుకోవ‌డం లేద‌న్నారు. ఈ విష‌యాన్ని చైనా ప్ర‌జ‌లు కూడా అర్థం చేసుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. అయితే, టిబెట్‌కు అర్థ‌వంత‌మైన స్వ‌యం ప్ర‌తిప‌త్తి ని తాము కోరుకుంటున్నామ‌న్నారు. అలాగే, టిబెట్ బౌద్ధ సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ‌ను కోరుకుంటున్నామ‌న్నారు.

Dalai Lama comments on Tibet: భార‌త్‌, చైనాల‌పై..

భార‌త్‌, చైనా ల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌పై కూడా ద‌లైలామా స్పందించారు. సైనిక బ‌లంతో వివాదాలు ప‌రిష్కారం అవ‌డానికి కాలం చెల్లింద‌న్నారు. అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌ల ద్వారా శాంతియుతంగా వివాదాల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. స‌మ‌స్త మాన‌వాళి స‌మాన‌మేన‌ని, ప్ర‌జ‌లు `నా దేశం, నా సిద్ధాంతం` అనే సంకుచిత మ‌న‌స్త‌త్వాన్ని విడ‌నాడాల‌ని కోరారు. ఈ సంకుచిత భావ‌న‌ల వ‌ల్ల‌నే ప్ర‌జ‌ల మ‌ధ్య‌, దేశాల మ‌ధ్య విబేధాలు వ‌స్తున్నాయ‌ని, యుద్ధాలు వ‌స్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. ``ఇష్టం ఉన్నా, లేక‌పోయినా మ‌నమంతా క‌లిసి జీవించాల్సిందే. కుటుంబంలో స‌మ‌స్య‌లు ఉంటే, మాట్లాడుకుని ఎలా ప‌రిష్క‌రించుకుంటారో, దేశాల మ‌ధ్య వివాదాల‌ను కూడా అలాగే ప‌రిష్క‌రించుకోవాలి`` అన్నారు.

Dalai Lama comments on Tibet: లేహ్‌కు ద‌లైలామా

బౌద్ధుల ఆధ్యాత్మ‌క గురువు ద‌లైలామా శుక్ర‌వారం ల‌ద్దాఖ్‌లోని లేహ్‌కు చేరుకున్నారు. ద‌లైలామాకు లేహ్‌లో పెద్ద ఎత్తున బౌద్ధులు, భారీ వ‌ర్షాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అక్క‌డ ఆయ‌న నెల రోజుల‌కు పైగా బ‌స చేస్తారు. ద‌లైలామా లేహ్ ప‌ర్య‌ట‌నతో చైనాను మ‌రింత రెచ్చ‌గొట్టిన‌ట్లు అవుతుంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ద‌లైలామా భార‌తదేశ‌ ఆశ్ర‌యంలో ఉన్నారు.

Dalai Lama comments on Tibet: చైనా పై వ్యాఖ్య‌లు

చైనాలోని కొంత‌మంది మాత్ర‌మే త‌న‌ను త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నార‌ని ద‌లైలామా వ్యాఖ్యానించారు. నేను టిబెట్‌కు స్వాతంత్య్రాన్ని కాదు.. అర్ధ‌వంత‌మైన స్వ‌యం ప్ర‌తిప‌త్తిని మాత్ర‌మే కోరుకుంటున్నాన‌న్న విష‌యం ఇప్ప‌డు చాలా మంది చైనీయులు అర్థం చేసుకుంటున్నారు` అని వ్యాఖ్యానించారు. చైనా ప్ర‌జ‌లు చాలా మంది ఇప్పుడు టిబెట్ బౌద్ధ సంస్కృతిపై ఆస‌క్తి పెంచుకుంటున్నార‌న్నారు.

Dalai Lama comments on Tibet: ద‌లైలామా అస‌లు పేరు

బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు ద‌లైలామా అస‌లు పేరు టెంజిన్ గ్యాట్సో. బౌద్ధ మ‌త గురువు హోదాలో ద‌లైలామాగా ప్ర‌సిద్ధి గాంచారు. టిబెట్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వ్య‌క్తిగా ఆయ‌న‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు గుర్తిస్తారు. ద‌లైలామాకు 1989లో నోబెల్ శాంతి బ‌హుమ‌తి లభించింది. ద‌లైలామాకు ఆశ్ర‌యం క‌ల్పించ‌డంపై చైనా ప‌లుమార్లు భార‌త్‌పై విమ‌ర్శ‌లు గుప్పించింది. అయితే, ద‌లైలామ త‌మ ఆత్మీయ అతిథి అని భార‌త్ స్ప‌ష్టం చేసింది.

IPL_Entry_Point