Group Captain Dhami: తొలిసారి ఒక మహిళకు ఐఏఎఫ్ మిస్సైల్ స్క్వాడ్రన్ బాధ్యతలు-in a first iaf assigns woman officer to take charge of combat unit ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Group Captain Dhami: తొలిసారి ఒక మహిళకు ఐఏఎఫ్ మిస్సైల్ స్క్వాడ్రన్ బాధ్యతలు

Group Captain Dhami: తొలిసారి ఒక మహిళకు ఐఏఎఫ్ మిస్సైల్ స్క్వాడ్రన్ బాధ్యతలు

HT Telugu Desk HT Telugu
Mar 07, 2023 05:04 PM IST

Group Captain Dhami: భారతీయ వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ షాలిజ ధామి (Group Captain Shaliza Dhami) రికార్డు సృష్టించారు. యుద్ధ రంగంలో ముందుండి పోరాడే పోరాట దళ (combat command) బాధ్యతలను స్వీకరించనున్న తొలి మహిళగా నిలిచారు.

గ్రూప్ కెప్టెన్ షాలిజ ధామి
గ్రూప్ కెప్టెన్ షాలిజ ధామి

Group Captain Dhami: భారతీయ వైమానిక దళం (Indian Air Force) లోని పశ్చిమ విభాగం (western sector) లో గ్రూప్ కెప్టెన్ గా ఉన్న షాలిజ ధామిని (Group Captain Shaliza Dhami) మిస్సైల్ స్క్వాడ్రన్ (missile squadron) కు ఇన్ చార్జిగా నియమించారు. ఇలా కీలకమైన ఒక కంబాట్ యూనిట్ బాధ్యతలను స్వీకరించనున్న తొలి మహిళగా గ్రూప్ కెప్టెన్ షాలిజ ధామి (Group Captain Shaliza Dhami) రికార్డు సృష్టించారు. మహిళలకు యుద్ధ రంగ బాధ్యతలను కూడా అప్పగించాలన్న సాయుధ దళాల విధాన నిర్ణయంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's day) సందర్భంగా ఐఏఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.

Group Captain Dhami: 2003 నుంచి..

2003లో షాలిజ ధామి ఎయిర్ ఫోర్స్ లో హెలీకాప్టర్ పైలట్ గా విధుల్లో చేరారు. దాదాపు 2900 ఫ్లైయింగ్ హవర్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. షాలిజ ధామి తొలి మహిళా క్వాలిఫైడ్ ఫ్లైయింగ్ ఇన్ స్ట్రక్టర్, అలాగే వెస్ట్రన్ సెక్టర్ లో హెలికాప్టర్ యూనిట్ కు ఫ్లైట్ కమాండర్ గా వ్యవహరించిన తొలి మహిళ కూడా. ప్రస్తుతం షాలిజ ధామి వెస్ట్రన్ సెక్టర్ లోని ఫ్రంట్ లైన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ లోని ఆపరేషన్స్ బ్రాంచ్ లో విధుల్లో ఉన్నారు. కీలక బాధ్యతలను, యుద్ధ రంగంలో ముందుండి పోరాడగల బాధ్యతలను, పురుష అధికారులతో సమానంగా మహిళా అధికారులకు ఇవ్వకూడదన్న భావన నుంచి సాయుధ దళాలు బయటకు వస్తున్నాయనడానికి షాలిజ ధామి నియామకమే ఉదాహరణ అని ఎయిర్ ఫోర్స్ అధికారులు వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుతం సాయుధ దళాల్లోని మహిళా అధికారులు యుద్ధ విమానాలను నడుపుతున్నారు. యుద్ధ నౌకలపై కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పర్సనల్ బిలో ఆఫీసర్ (personnel below officer PBOR) కేడర్ లోకి వెళ్తున్నారు. పర్మినెంట్ కమిషన్ కు అర్హత సాధిస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు’’ అని వివరించారు.

Captain Shiva Chouhan: సియాచిన్ పై కూడా..

ఆర్మీ, నేవీ కూడా తమ స్పెషల్ ఫోర్సెస్ లోకి మహిళాఅధికారులను తీసుకుంటున్నాయి. ఆర్మీకి చెందిన గరుడ కమాండో(Garud commando) లో, నేవీకి చెందిన మెరైన్ కమాండోస్(Marine Commandos) లో ఇప్పుడు మహిళాఅధికారులు ఉన్నారు. రెండు నెలల క్రితం ఆర్మీ హిమాలయాల్లో అత్యంత ఎత్తైన, ప్రమాదకరమైన సియాచిన్ గ్లేసియర్ (Siachen glacier) యూనిట్ లోకి తొలిసారి మహిళాఅ ధికారిని పంపించింది. ఆ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా కెప్టెన్ శివ చౌహాన్ (Captain Shiva Chouhan) నిలిచారు.

Whats_app_banner