IIT Indore Recruitment: ఐఐటీ ఇండోర్ లో ఫాకల్టీ రిక్రూట్ మెంట్
అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్ట్ ల భర్తీకి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండోర్ (Indian Institute of Technology, Indore) నోటిఫికేషన్ జారీ చేసింది.
ఐఐటీ ఇండోర్ (Indian Institute of Technology, Indore) లో ఫాకల్టీ (Assistant Professor) పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ అప్లికేషన్
వివిధ విభాగాల్లో మొత్తం 34 అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్ట్ ల భర్తీకి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండోర్ (Indian Institute of Technology, Indore) నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో iiti.ac.in. వెబ్ సైట్ ద్వారా ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్ లకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 21.
Eligibility Criteria అర్హత, ఇతర వివరాలు..
ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్ట్ ల దరఖాస్తు చేసుకునే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా iiti.ac.in. లోని నోటిఫికేషన్ ను పరిశీలించాలి. సంబంధిత విభాగంలో పీహెచ్ డీ (Ph.D.) తో పాటు, పీజీలో ఫస్ట్ క్లాస్, మంచి అకడమిక్ రికార్డ్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి 32 సంవత్సరాలు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1 (Assistant Professor Grade I) పోస్ట్ కు వేతన స్కేలు రూ. 1,01,500/ గా ఉంటుంది. అలాగే, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 (Assistant Professor Grade II post) వేతన స్కేలు రూ. 70,900/ గా ఉంది. అలాగే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ మొదలైనవి లభిస్తాయి.
Selection Process: ఎంపిక ప్రక్రియ
అర్హతలు పరిశీలించిన తరువాత అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. Assistant Professor ఇంటర్వ్యూకి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు హాజరు కావాల్సి ఉంటుంది.