Anand Mahindra | 'ఆ విషయం చెప్తే.. నా ఉద్యోగం పోతుంది'-if i tell you i will be fired says anand mahindra on scorpio launch ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  'If I Tell You, I Will Be Fired,' Says Anand Mahindra On Scorpio Launch

Anand Mahindra | 'ఆ విషయం చెప్తే.. నా ఉద్యోగం పోతుంది'

HT Telugu Desk HT Telugu
May 06, 2022 02:03 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్​ మహీంద్ర చేసిన ఓ ట్వీట్​ ఇప్పుడు వైరల్​గా మారింది. 'ఆ విషయం చెబితే.. నా ఉద్యోగం పోతుంది,' అని ఆ ట్వీట్​లో ఆయన పేర్కొన్నారు.

ఆనంద్​ మహీంద్ర
ఆనంద్​ మహీంద్ర (Twitter)

Anand Mahindra twitter | ప్రముఖ వ్యాపారవేత్త, ఎం అండ్​ ఎం ఛైర్మన్​ ఆనంద్​ మహీంద్ర.. ట్విట్టర్​లో చురుకుగా ఉంటారు. తన ఫాలోవర్లతో మాట్లాడుతుంటారు. ఎన్నో విలువైన విషయాలను, ఫన్నీ సంఘటనలను సైతం షేర్​ చేస్తూ ఉంటారు. ఫాలోవర్లు అడిగే కొన్ని ప్రశ్నలకు.. తనదైన శైలిలో జవాబులిస్తుంటారు ఆనంద్​ మహీంద్ర. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కొత్త స్కార్పియో ఎస్​యూవీ ఎప్పుడు లాంచ్​ అవుతుంది? అని ఓ యూజర్​ అడిగిన ప్రశ్నకు ఆనంద్​ మహీంద్ర ఇచ్చిన జవాబు.. ఇప్పుడు వైరల్​గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

'సర్​ కొత్త స్కార్పియో ఎప్పుడు విడుదల అవుతుంది? చెప్పండి సర్​. మేము చాలా ఎదురు చూస్తున్నాము,' అని ఓ ఫాలోవర్​ ట్వీట్​ చేశారు. దానికి బదులిస్తూ.. 'ష్​ష్​ష్​.. ఆ విషయం నీకు చెబితే, నా ఉద్యోగం ఊడిపోతుంది. కానీ కొత్త స్కార్పియో కోసం నీతో పాటు నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను,' అని ట్వీట్​ చేశారు ఆనంద్​ మహీంద్ర.

ఎప్పుడు, ఎక్కడ, ఏం చెప్పాలో ఆనంద్​ మహీంద్రకు బాగా తెలుసు అని మరోమారు ఆయన నిరూపించుకున్నారు.

కాగా.. ఆనంద్​ మహీంద్ర ట్వీట్​ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. 'మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించేది ఎవరు సర్​?' అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. 'బెస్ట్​ హ్యూమరస్​ ట్వీట్​ ఇదే' అని ఇంకొందరు అంటున్నారు.

'ఏదిఏమైనా.. మొత్తానికి కొత్త స్కార్పియో లాంచ్​ కోసం ఎదురుచూడక తప్పదు,' అని మరికొందరు ట్వీట్​ చేస్తున్నారు.

జూన్​లో లాంచ్​?

New Scorpio launch date | కొత్త స్కార్పియో లాంచ్​తో పాటు ఇతర వివరాలను ఎం అండ్​ ఎం ఇంకా బయటపెట్టలేదు. కాగా.. మార్కెట్​లోకి స్కార్పియో అడుగుపెట్టి.. ఈ జూన్​తో 20ఏళ్లు నిండుతాయి. అందుకు తగ్గట్టుగానే కొత్త స్కార్పియోను తీసుకొద్దామని సంస్థ భావిస్తున్నట్టు సమాచారం.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్