IDFC First Bank Q2 results: IDFC First Bank అద్భుత ఫలితాలు
IDFC First Bank Q2 results: 2022-23 ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక Q2 ఫలితాలను బ్యాంక్ శనివారం వెల్లడించింది. గత సంవత్సరం Q2తో పోలిస్తే, ఈ Q2లో బ్యాంక్ 35% అధిక ఆదాయాన్ని సముపార్జించింది.
IDFC First Bank Q2 results: IDFC First Bank ఈ Q2 లో రూ. 3,947 కోట్ల ఆపరేటింగ్ ఇన్ కం సంపాదించింది. గత ఆర్థిక సంవత్సరం Q2 తో పోలిస్తే.. ఇది 35% అధికం. గత ఆర్థిక సంవత్సరం Q2 బ్యాంక్ రూ. 2,930 కోట్ల ఆపరేటింగ్ ఆదాయం సాధించింది.
IDFC First Bank Q2 results: Q1తో పోలిస్తే..
లాభాల విషయానికి వస్తే.. గత సంవత్సరం Q2లో బ్యాంక్ సాధించిన లాభం రూ. 152 కోట్లు కాగా, ఈ సంవత్సరం అది రూ. 566 కోట్లు. అంటే బ్యాంక గత సంవత్సరం Q2తో పోలిస్తే.. 266% అధిక లాభాలను ఆర్జించింది. అలాగే, పన్ను అనంతర ఆదాయంలోనూ బ్యాంక్ 17% అధిక లాభాలను సాధించగలిగింది. నికర వడ్డీ ఆదాయంలోనూ ఈ త్రైమాసికంలో బ్యాంక్ గణనీయ ఫలితాలను సాధించింది. ఈ Q2లో రూ. 3002 కోట్ల నికర వడ్డీ లాభాన్ని బ్యాంక్ ఆర్జించింది. గత Q2లో ఇది రూ. 2,272 కోట్లు మాత్రమే.
IDFC First Bank Q2 results: సీఈఓ కామెంట్
కోర్ ఆపరేటింగ్ ఇన్ కమ్ వల్లనే ఈ సానుకూల ఫలితాలు సాధ్యమయ్యాయని బ్యాంక్ ప్రకటించింది. గత మూడేళ్లుగా పునాది స్థాయి నుంచి ప్రణాళికాబద్ధంగా చేసిన కృషి కారణంగా నే ఈ ఫలితాలు వచ్చాయని బ్యాంక్ ఎండీ, సీఈఓ వైద్యనాథన్ తెలిపారు. భవిష్యత్తులో కచ్చితంగా మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తామన్నారు.