IDBI Recruitment 2023 : ఐడీబీఐ బ్యాంక్‌లో భారీగా వేకెన్సీలు.. అప్లికేషన్ ప్రక్రియ షురూ..!
IDBI Recruitment 2023 : వేకెన్సీలను భర్తీ చేసేందుకు అప్లికేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది ఐడీబీఐ బ్యాంక్. ఆ వివరాలు..
IDBI Recruitment 2023 : వివిధ పోస్టుల భర్తీకి అనేక బ్యాంక్ సంస్థలు ఇటీవలి కాలంలో నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నాయి. ఈ జాబితాలోకి ఐడీబీఐ బ్యాంక్ కూడా చేరింది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల వేకెన్సీని భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది సంస్థ. అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ నెల 30 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.
ఐడీబీఐ రిక్రూట్మెంట్ 2023 వివరాలు..
ఈ దఫా రిక్రూట్మెంట్లోమొత్తం 600 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది ఐడీబీఐ బ్యాంక్. idbibank.in వెబ్సైట్లో అప్లికేషన్ వేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 20న ఆన్లైన్ పరీక్ష జరుగుతుంది. ఇతర వివరాల్లోకి వెళితే..
మొత్తం వేకెన్సీలు:- జూనియర్ అసిస్టెంట్ మేనేజర్- 600 పోస్టులు
IDBI Recruitment 2023 apple online : వయస్సు పరిమితి:- అప్లికేషన్ వేయాలని భావిస్తున్న వారి కనిష్ఠ వయస్సు 20ఏళ్లు, గరిష్ఠ వయస్సు 25ఏళ్లుగా ఉండాలి.
విద్యార్హత:- కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి.
అప్లికేషన్ ఫీజు:- ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 200. ఇతరులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.
IDBI Recruitment 2023 notification : సెలక్షన్ ప్రక్రియ:- తొలుత ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. క్వాలిఫై మార్కులను పరీక్ష తర్వాత వెల్లడించే అవకాశం ఉంది.
ఐడీబీఐ రిక్రూట్మెంట్ 2023.. ఇలా అప్లై చేసుకోండి..
స్టెప్ 1:- అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి కెరీర్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 2:- Recruitment of Junior Assistant Manager through Admissions to IDBI Bank PGDBF – 2023 - 24" లింక్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3:- రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
స్టెప్ 4:- ఫామ్ ఫిల్ చేసి, ఫీజు చెల్లించి, అప్లికేషన్‌ను సబ్మీట్ చేయండి.
స్టెప్ 5:- సంబంధిత పేజ్‌ను ప్రింటౌట్ తీసుకోండి.
ఆర్బీఐలో అసిస్టెంట్ జాబ్స్..
అసిస్టెంబ్ ఉద్యోగాల భర్తీకి ఆర్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం సెప్టెంబర్ 13 నుంచి అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది. అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 4. ఆర్బీఐ రిక్రూట్ మెంట్ అధికారిక వెబ్ సైట్ opportunities.rbi.org.in. ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం