RBI Assistant jobs: డిగ్రీ ఉంటే చాలు.. ఆర్బీఐలో అసిస్టెంట్ జాబ్స్; వెంటనే అప్లై చేయండి
RBI Assistant jobs 2023: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 450 అసిస్టెంట్ జాబ్స్ ను భర్తీ చేస్తున్నారు.
RBI Assistant jobs 2023: అసిస్టెంబ్ ఉద్యోగాల భర్తీకి ఆర్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 13 నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 4. ఆర్బీఐ రిక్రూట్ మెంట్ అధికారిక వెబ్ సైట్ opportunities.rbi.org.in. ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
ట్రెండింగ్ వార్తలు
450 పోస్ట్ లు..
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 450 అసిస్టెంట్ జాబ్స్ ను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 21, 23 తేదీల్లో ఆన్ లైన్ లో జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్ 2వ తేదీన మెయిన్ పరీక్ష రాయల్సి ఉంటుంది. ఆ తరువాత లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్స్ కు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, 1995 సెప్టెంబర్ 1వ తేదీ కి ముందు పుట్టినవారు కానీ, 2003 సెప్టెంబర్ 2 వ తేదీ తరువాత పుట్టినవారు కానీ ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అనర్హులు. రిజర్వేషన్ల ప్రకారం వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది.
అర్హత డిగ్రీ
ఈ ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్స్ కు అప్లై చేసే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఏదైనా డిసిప్లిన్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వారికి 2023 సెప్టెంబర్ 1 నాటికి డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు డిగ్రీ పూర్తి చేసి ఉంటే చాలు. 50% మార్కులు ఉండాలన్న నిబంధన వారికి వర్తించదు. ఏ రాష్ట్రం తరఫున దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఆ రాష్ట్ర స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ కు అప్లికేషన్ ఫీజు రూ. 50 మరియు దానిపై 18% జీఎస్టీ. ఇతరులకు రూ. 450 మరియు దానిపై 18% జీఎస్టీ.