Amarnath cloudburst: కొనసాగుతున్న సహాయక చర్యలు -iaf deployed for rescue effort at amarnath shrine full details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Iaf Deployed For Rescue Effort At Amarnath Shrine Full Details Here

Amarnath cloudburst: కొనసాగుతున్న సహాయక చర్యలు

HT Telugu Desk HT Telugu
Jul 10, 2022 07:45 AM IST

Amarnath Yatra: అమర్​నాథ్​ యాత్రలో సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు
కొనసాగుతున్న సహాయక చర్యలు (ANI)

Amarnath cloudburst Updates: అమర్‌నాథ్‌ యాత్రలో సంభవించిన ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. తప్పిపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. సహాయక చర్యల కోసం ఆర్మీకి చెందిన పర్వత గస్తీ బృందాలను, డ్రోన్లు, జాగిలాలు, అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు 16 మృతదేహాలను బాల్టాల్‌ బేస్‌ క్యాంప్‌నకు తరలించినట్లు బీఎస్‌ఎఫ్‌ తెలిపింది.

రంగంలోకి 4 ఎమ్ఐ-17వీ5 హెలికాఫ్టర్లు ..

సహాయక చర్యల్లో భాగంగా శనివారం 4 ఎమ్ఐ-17వీ5, 4 చెటల్ హెలికాఫ్టర్స్ ను రంగంలోకి దింపింది భారత వాయుసేన. వీటి ద్వారా యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు అమర్​నాథ్​ యాత్రలో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న 15వేల మందిని సైన్యం రక్షించింది. వరదల ధాటికి 16మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 40మందికిపైగా ప్రజలు గల్లంతయ్యారు. వీరి కోసం ఆన్వేషణ కొనసాగుతోంది.

ఏం జరిగిందంటే…

దక్షిణ కశ్మీర్​ హిమాలయాల్లో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షాలు కురిశాయి. కుంభవృష్టి కారణంగా అమర్​నాథ్​ యాత్ర మార్గాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో అనేకమంది యాత్రికులు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటికే 16మంది మరణించారు. కొండచరియలు విరిగిపడకపోయినా, భారీ వర్షాలు శనివారం కూడా కొనసాగాయి. సహాయక చర్యల కోసం 100మందితో కూడిన నాలుగు ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సైన్యం, సీఆర్​పీఎఫ్​ దళాలు సైతం రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే 15వేలమంది యాత్రికులను అమర్​నాథ్​ యాత్ర బేస్​ క్యాంప్​ అయిన పంచతర్నికి శనివారం ఉదయం తరలించారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను సమీక్షించారు.

IPL_Entry_Point