Himanta Sarma: హిమంత బిశ్వ శర్మ.. ఈశాన్యాన కమల వికాస సూత్రధారి-himanta sarma deal maker for a saffron sunrise in the northeast ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Himanta Sarma: Deal-maker For A Saffron Sunrise In The Northeast

Himanta Sarma: హిమంత బిశ్వ శర్మ.. ఈశాన్యాన కమల వికాస సూత్రధారి

HT Telugu Desk HT Telugu
Mar 02, 2023 06:27 PM IST

Himanta Sarma: ఇటీవల జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల (North East States) అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపుర, నాగాలాండ్ ల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైంది.

అస్సాం సీఎం, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ
అస్సాం సీఎం, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ (HT_PRINT)

Himanta Biswa Sarma: త్రిపుర (Tripura), నాగాలాండ్ Nagaland) ఎన్నికల్లో బీజేపీ విజయం దాదాపు ఊహించిందే. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకప్పుడు క్షేత్రస్థాయిలో కనీసం కనిపించని పార్టీ.. ఇప్పుడు ఏకంగా అధికారంలోకి రావడం వెనుక చాలా శక్తుల కృషి ఉంది. ప్రధాని మోదీ (PM Modi), హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ల సుడిగాలి పర్యటనలు, మోదీ ఇమేజ్ వంటివి ఈ విజయాలకు సంబంధించి తెరపై కనిపించే కారణాలైతే.. తెరవెనుక వ్యూహాత్మకంగా పావులు కదిపిన చాణక్యం అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మది.

ట్రెండింగ్ వార్తలు

Northeast game changer: కామ్ గా.. ప్లాన్డ్ గా..

ఈశాన్య రాష్ట్రాల్లో (North East States) బీజేపీ బలోపేతం కావడానికి హిమంత శర్మ (Himanta Biswa Sarma) వ్యూహాలే ప్రధాన కారణం. అప్పటికే ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి రావడం, క్రమంగా ఆయా రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పార్టీ బలం పుంజుకునేలా చూడడం హిమంత శర్మ వ్యూహాల్లో ఒకటి. ఈశాన్య రాష్ట్రాల్లో (North East States) పార్టీని బలోపేతం చేయడం ద్వారా బీజేపీ అగ్ర నేతల్లో ఒకరుగా హిమంత శర్మ (Himanta Biswa Sarma) మారిపోయారు. ఇటీవల జరిగిన గుజరాత్, ఢిల్లీ ఎన్నికల్లో హిమంత శర్మ స్టార్ ప్రచారకర్తల్లో ఒకరన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎన్నికల వ్యూహాల్లో హిమంత శర్మది అందెవేసిన చేయి అని పార్టీ నేతలే చెప్పుకుంటుంటారు. ముఖ్యంగా, క్రిస్టియన్లు అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హిందుత్వ ఎజెండా ప్రధానంగా ఉన్న బీజేపీని గెలిపించడం సామాన్యమైన విషయం కాదని చెబుతుంటారు.

Himanta Biswa Sarma: ప్రతీరోజు పర్యటన

ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరపడిన నాటినుంచి దాదాపు ప్రతీరోజు హిమంత శర్మ అస్సాం రాజధాని గువాహటి నుంచి ఈ ఈశాన్య రాష్ట్రాలకు ఫ్లైట్ లో వెళ్లేవారు. నాగాలాండ్ లో నీఫ్యూ రియోకు మద్దతిచ్చి, అధికారం పంచుకున్నా, త్రిపుర (Tripura) లో అనూహ్యంగా క్లీన్ ఇమేజ్ ఉన్న మానిక్ సాహ (Manik Saha) ను పార్టీ తరఫున తెరపైకి తీసుకువచ్చినా.. మేఘాలయలో తమతో పొత్తు ను వద్దనుకుని ఒంటరిగా పోటీ చేసి మెజారిటీకి దగ్గరగా వచ్చిన ఎన్పీపీ నేత కన్రాడ్ సంగ్మా (Conrad Sangma)ని మళ్లీ తమతో పొత్తుకు సిద్ధమయ్యేలా చేసినా.. అన్నీ హిమంత శర్మ (Himanta Biswa Sarma) వ్యూహాల్లో భాగమే. ఎన్పీపీకి సంపూర్ణ మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన నేపథ్యంలో, ఈ కౌంటింగ్ కు ముందే, రెండుసార్లు స్వయంగా గువాహటి వెళ్లి అస్సాం సీఎం హిమంత శర్మతో కన్రాడ్ సంగ్మా ప్రత్యేకంగా సమావేశమవడం గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం.

Himanta Biswa Sarma: తిప్ర మోథా తో విఫల చర్చలు..

అయితే, త్రిపుర (Tripura) రాజవంశ ప్రతినిధికి చెందిన తిప్ర మోథా (Tipra Motha) ను కూడా బీజేపీ కూటమిలో చేర్చుకునేందుకు హిమంత శర్మ (Himanta Biswa Sarma) చేసిన ప్రయత్నం మాత్రం విఫలమైంది. ప్రత్యేక తిర్ప రాష్ట్రం కోసం తిప్ర మోథా గట్టిగా పట్టుబట్టడం, అందుకు బీజేపీ సిద్ధంగా లేకపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి.

IPL_Entry_Point