ఇండియాపై తప్పుడు ప్రచారం.. 16 యూట్యూబ్ ఛానెళ్లు బ్లాక్
ఢిల్లీ: 16 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది కేంద్రం. వీటిల్లో నాలుగు పాకిస్థాన్‌కు చెందినవి. ఇండియాకు వ్యతిరేకంగా కంటెంట్‌ను రూపొందించడంతో పాటు దేశంలో మతపరమైన ఘర్షణలకు రెచ్చగొట్టే విధంగా ఇవి ఉన్నట్టు, అందుకే బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది.
Youtube channels blocked India | ఇండియాపై తప్పుడు ప్రచారాలు సాగిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం మరోమారు పంజా విసిరింది. ఇటీవలి కాలంలో 25కుపైగా యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసిన కేంద్రం.. తాజాగా ఆ జాబితాలోకి మరో 16 ఛానెళ్లను చేర్చింది. ఈ మేరకు 2021 ఐటీ నిబంధనల్లోని అధికారాలను ఉపయోగించుకుని వాటిని బ్లాక్ చేస్తున్నట్టు సమాచారశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఈ 16 ఛానెళ్లల్లో 10 ఇండియాకు చెందినవి కాగా.. మరో 6.. పాకిస్థాన్‌కు చెందినవని తెలుస్తోంది. వీటిల్లో జాతీయ భద్రతకు విఘాతం కలిగించే విధంగా కంటెంట్ ఉంటోందని అధికారులు వెల్లడించింది. మతపరమైన ఘర్షణలకు రెచ్చగొట్టే విధంగా, భారత్‌లోని ప్రజా వ్యవస్థను ధ్వంసం చేసే విధంగా ఈ ఛానెళ్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే వాటిని బ్లాక్ చేసినట్టు వివరించారు.
ఈ 16 యూట్యూబ్ ఛానెళ్లకు.. 68కోట్లుపైగా వ్యూవర్షిప్ ఉన్నట్టు తెలుస్తోంది.
నెలలో రెండోసారి…
యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేయడం.. ఏప్రిల్‌లో ఇది రెండోసారి. 22 యూట్యూబ్ ఛానెళ్లు, మూడు ట్విట్టర్ ఖాతాలు, ఒక ఫేస్బుక్ ఆకౌంట్, ఒక న్యూస్ వెబ్‌సైట్‌ను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది. 2021 ఐటీ నిబంధనల్లోని అత్యవసర అధికారాలను ఉపయోగించి వీటిపై నిషేధం విధిస్తున్నట్టు ఏప్రిల్ 5న ఆదేశాలు జారీ చేసింది. ఆయా సామాజిక మాధ్యమాలు.. ఫేక్ న్యూస్‌ను వ్యాపింపజేస్తూ.. దేశ భద్రత, విదేశీ సంబంధాలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆ ఆదేశాల్లో పేర్కొంది కేంద్ర సమాచారశాఖ.
సంబంధిత కథనం