Gold and Silver Price Today| స్థిరంగా కొనసాగుతున్న పసిడి.. భారీగా పెరిగిన వెండి-gold and silver prices today 2022 april 12 in india ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gold And Silver Price Today| స్థిరంగా కొనసాగుతున్న పసిడి.. భారీగా పెరిగిన వెండి

Gold and Silver Price Today| స్థిరంగా కొనసాగుతున్న పసిడి.. భారీగా పెరిగిన వెండి

HT Telugu Desk HT Telugu
Apr 12, 2022 07:20 AM IST

ఈ రోజు(ఏప్రిల్ 12) బంగారం స్థిరంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో వెండి ధర కూడా భారీగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.53,020ల వద్ద కొనసాగుతుంది.

<p>స్థిరంగా బంగారం.. పెరిగిన వెండి</p>
స్థిరంగా బంగారం.. పెరిగిన వెండి (REUTERS)

గత కొన్నిరోజులుగా బంగారం, వెండి ధరలు రోజు రోజుకు క్రమంగా పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా పసిడి ఇటీవల కాలంలో నిత్యం పెరుగుతూ వినియోగదారులకు అందని ద్రాక్షగా మారింది. అయితే నిన్నటితో(సోమవారం) పోలిస్తే నేడు(మంగళవారం-2022 ఏప్రిల్ 12) బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,600లుగా ఉంది. ఇదే 8 గ్రాముల బంగారం అయితే రూ.38,880లుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి 53,120లుగా ఉంది. 8 గ్రాముల 24 క్యారెట్ల పసిడి వచ్చేసి రూ.42,416లుగా కొనసాగుతుంది. నిన్నటి రేట్లతో పోలిస్తే నేడు పెద్దగా ధరలో మార్పేమి లేదు.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

నగరాల వారీగా బంగారం ధర..

దేశ రాజధానీ దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,600లుగా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.53,020లుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 48,600లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.53,020లుగా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 49,460లు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర వచ్చేసి రూ.53,960లుగా ఉంది. మిగిలిన నగరాలతో పోలిస్తే చెన్నైలో కాస్త ఎక్కువగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.48,600లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.53,020లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఈ విధంగా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర వచ్చేసి రూ.53,020ల వద్ద కొనసాగుతుంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.48,600లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.53,020లుగా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.48,600లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.53,020లుగా కొనసాగుతుంది.

నిన్నటితో పోలిస్తే దేశీయంగా కిలో వెండి ధర భారీగా పెరిగింది. దాదాపు రూ.800 వరకు పెరిగింది. దిల్లీలో కేజీ వెండి ధర రూ.67,700ల వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో రూ.72,300లు ఉండగా.. బెంగళూరులోనూ కిలో వెండి రూ.72,300లుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,300లు, విజయవాడలో రూ.72,300లు, విశాఖపట్నంలోనూ రూ.72,300లుగా ఉంది.

 

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్